Site icon NTV Telugu

Baba sitting on a Hot Griddle: ఈ బాబా చాలా హాట్‌ గురూ.. వేడివేడి పెనంపై కూర్చున్నా!

Hot Griddle

Hot Griddle

Baba sitting on a Hot Griddle: బాగేశ్వర్ ధామ్ పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తర్వాత ఇప్పుడు చాలా మంది బాబాలు వెలుగులోకి వస్తున్నారు. చాలా మంది బాబాలు వివిధ రకాల మ్యాజిక్‌లు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. కొంతమంది బాబాలు తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షిస్తానని ప్రజలను నమ్మిస్తున్నారు. మరికొందరు బాబాలు మరొక విధంగా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి బాబా మరొకరు చర్చకు వస్తున్నారు. ఈ బాబా మండుతున్న పొయ్యిపై పెనం మీద కూర్చుని భక్తులకు దీవెనలు ఇస్తున్నారు. మరోవైపు అనుకోకుండా చెప్పులు ధరించి భక్తుడు అతని వద్దకు వస్తే, స్టవ్‌పై కూర్చున్న బాబా అతడిని తీవ్రంగా మందలించాడు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో బాబా ప్రత్యేకంగా తెల్లటి గుడ్డ ధరించి వేడి పెనంపై కూర్చుని ఉండగా ఆయన పాదాలను భక్తులు నమస్కరిస్తున్నారు.

వేడివేడిగా ఉన్న పెనంపై కూర్చుని భక్తులను బాబా ఆశీర్వదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంత్ గురుదాస్ మహరాజ్‌గా గుర్తించబడిన ఈ బాబా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గోసంరక్షణ సంస్థలను నడుపుతున్నాడు. వేడివేడి పెనంపై కూర్చుని భక్తులను ఆశీర్వించిన తర్వాత.. స్వయంగా ఆయనే తాను అద్భుతమైన బాబాను కాదని చెప్పాడు. “మహాశివరాత్రి నాడు ఆశ్రమంలో భారీ విందు జరిగింది. నేను వేడి పెనం మీద కూర్చున్నాను. ఓ భక్తుడు ఈ వీడియో తీసి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది అద్భుతం కాదు” అని గురుదాస్ మహరాజ్ అన్నారు.

Read Also: Woman Jumps into Well: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో బావిలో దూకిన భార్య.. కానీ..

ఓ వైరల్‌ వీడియోలో.. బాబా పెనంపై కూర్చున్నారు, ఒక భక్తుడు పొయ్యిలో కట్టెలు వేస్తాడు, అప్పుడు కొంతమంది పొరపాటున చెప్పులు ధరించి వచ్చారు. అప్పుడు బాబా వారిని దుర్భాషలాడుతున్నారు. అమరావతి నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ బాబా ఆశ్రమం తివాసా తహసీల్‌లోని మార్డి కర్లా రోడ్డులో ఉంది. బాబా పేరు సచ్చిదానంద్ గురు దాస్ బాబా. బాబా బహిరంగ కార్యక్రమాలలో రోటీ చేయడానికి పొయ్యి మీద కూర్చోవడానికి ఇష్టపడతారు. ఆయన భక్తులు దానిని ధ్యానంగా భావిస్తారు. ఈ విషయంలో సచ్చిదానంద్ గురు దాస్ బాబా మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు తన శరీరంలోకి శక్తి ఆవహిస్తుంది. ఏదో ఒక దివ్యశక్తి నా శరీరంలోకి ప్రవేశించినప్పుడు, నేను ఏమి చేస్తున్నానో, ఎక్కడ కూర్చున్నానో కూడా నాకు తెలియదు. నేను లార్డ్ గౌతమ బుద్ధుడు, రామచంద్రుడు, జీసస్ క్రైస్ట్, సెయింట్ గాడ్గే, బాబా క్రుఖ్నాజీ మహారాజ్ అనుచరుడిని. నేను అద్భుత బాబాను కాను, నన్ను ఎవరూ బాబా అని పిలవకూడదు. చేతులు జోడించి వీడియోను షేర్ చేయడం ఆపేయాలని నేను అభ్యర్థిస్తున్నాను.’ అని అన్నారు.

మరోవైపు, వైరల్ వీడియో ఆధారంగా అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉంటే, వీడియో వైరల్ కావడంతో.. ఇది అద్భుతం కాదని మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి కార్యదర్శి హరీష్ కేదార్ అన్నారు. అలాగే మూఢనమ్మకాల నిరోధక చట్టం ప్రకారం ఈ కమిటీకి కార్యదర్శులుగా ఉన్న స్థానిక పోలీసు అధికారులు ఇలాంటి మూఢనమ్మకాలను ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

Exit mobile version