NTV Telugu Site icon

Amrapali Kata: హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలి బాధ్యతల స్వీకరణ

Amrapali

Amrapali

నేడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఆమ్రపాలి కాట బాధ్యతలు చేపట్టారు. హెచ్ఎండిఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్ లతో పాటు హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె హెచ్ఎండీఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందని అన్నారు. తదుపరి మూసి రివర్ ఫ్రెంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టి కార్పొరేషన్ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు.

Read Also: YSRCP MLAs Joins TDP: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు

అయితే, హైదరాబాద్‌ అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా సర్కార్ కార్యాచరణ రెడీ చేస్తుంది. ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ టౌన్‌షిప్‌లతో పాటు ఇతరత్రా ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. దీంతో మహా నగరాభివృద్ధిలో ప్రణాళికల రూపకల్పనలో కీలకమైన హెచ్‌ఎండీఏ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఫలితంగా పూర్తి స్థాయి కమిషనర్‌ పోస్టును కొనసాగిస్తూనే కొత్తగా జాయింట్‌ కమిషనర్‌ పోస్టులో అదనంగా మరో ఐఏఎస్‌ అధికారిని ప్రభుత్వం నియమించింది. మరోవైపు త్వరలో హెచ్‌ఎండీఏను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ కొనసాగుతుంది.