Site icon NTV Telugu

Ammonia Gas: నెల్లూరు జిల్లాలో అమోనియా లీక్‌.. 10 మంది కార్మికులకు అస్వస్థత!

Ammonia Gas Leaked

Ammonia Gas Leaked

నెల్లూరు జిల్లాలో అమోనియా లీక్‌ ఘటన కలకలం సృష్టించింది. టీపీ గూడూరు మండలం అనంతపురం గ్రామంలో అమోనియా లీకైంది. వాటర్‌బేస్‌ కంపెనీలో అమోనియా గ్యాస్‌ లీక్‌ కావడంతో.. ఊపిరాడక కార్మికులు హుటాహుటిన పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.

అనంతపురం చుట్టుపక్కల గ్రామాలకు సైతం అమోనియా గ్యాస్‌ భారీగా వ్యాపించింది. అమోనియా గ్యాస్‌ లీక్‌తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్తగా అందరూ మాస్కులు ధరించారు. జనాలు ఇళ్లలోనే ఉండి తలుపులు, కిటికీలు వేసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version