Amitabh Bachchan: ఆ భయంతోనే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడలేదు: అమితాబ్ బచ్చన్
- 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ
- 11 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు
- ఫైనల్ మ్యాచ్ చూడలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan didn’t watch T20 World Cup Final: బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌కు క్రికెట్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబైలో జరిగే దాదాపు అన్ని మ్యాచ్‌లకు బిగ్‌బీ హాజరవుతారు. షూటింగ్స్ కారణంగా కుదరని సమయంలో టీవీలో అయినా ఆయన మ్యాచ్ వీక్షిస్తుంటారు. అలాంటి అమితాబ్.. భారత్ ఆడిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను చూడలేదట. ఈ విషయాన్ని బిగ్‌బీ స్వయంగా చెప్పారు. రోహిత్ సేన టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలిచిన విషయం తెలిశాక కళ్లలో నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ విజయం సాధించడం పట్ల అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే తాను ఎప్పుడు మ్యాచ్ చూసినా భారత్ ఓడిపోతుందని.. అందుకే ఫైనల్ మ్యాచ్‌ను చూడలేదని తెలిపారు. ‘నేను టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌ను చూడలేదు. ఎందుకంటే నేను చూసినప్పుడల్లా భారత్ ఓడిపోతుంది. మ్యాచ్ గెలిచిందని తెలిశాక కళ్లలో నీళ్లు వచ్చాయి. ప్రపంచ ఛాంపియన్స్ ఇండియా. భారత మాతాకి జై.. జై హింద్.. జై హింద్’ అని అమితాబ్ పేర్కొన్నారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: Hardik Pandya: అనుకోని విషయాలు జరిగిపోయాయి.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు!
శనివారం రాత్రి బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండోసారి పొట్టి ట్రోఫీని కైవసం చేసుకుంది. 2007లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత్ 11 సంవత్సరాల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు ముగింపు పలికింది. భారత్ చివరగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.
T 5057 – Tears flowing down .. in unison with those that TEAM INDIA sheds ..
WORLD CHAMPIONS INDIA 🇮🇳
भारत माता की जय 🇮🇳
जय हिन्द जय हिन्द जय हिन्द 🇮🇳— Amitabh Bachchan (@SrBachchan) June 29, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!