Amitabh Bachchan: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొడుతోంది. మొదటి భాగం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఆ సక్సెస్‌కి మరోసారి నిలువెత్తు సాక్ష్యంగా ఈ చాప్టర్ 1 నిలుస్తోంది. యాక్టర్‌గా, డైరెక్టర్‌గా రిషబ్ తనదైన నేటివ్ టచ్‌తో, భక్తి, ప్రకృతి, గ్రామీణ సంస్కృతి కలగలిపి చూపించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అయితే.. తాజాగా రిషబ్.. అమితాబ్ బచ్చన్ షో “కౌన్ బనేగా కరోడ్‌పతి”లో కనిపించాడు.
READ MORE: Protest: కస్టమర్లు రావడం లేదని.. సెలూన్ షాప్ యజమాని వినూత్న నిరసన!
అమితాబ్ బచ్చన్ షోలో తన బాల్యం నుంచి సినిమాల్లోకి ప్రవేశించే వరకు రిషబ్ అనేక విషయాలను పంచుకున్నాడు. ఐదవ తరగతిలో ఫెయిల్ అయినప్పటికీ తాను ఈ గేమ్ షోలో కనిపించానన్నాడు. అయితే.. ఈ సందర్భంగా కాంతార సినిమా గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడారు. “ముందుగా నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను ఇంకా మీ కాంతారను చూడలేదు. నాకు సమయం లేదు. కానీ మా కూతురు శ్వేత ప్రతి సినిమా చూసి ఇంటికి వచ్చి చెబుతుంది. ఆమె కాంతారను చూసింది. ఈ సినిమా చూసిన తరువాత వరుసగా మూడు లేదా నాలుగు రోజులు నిద్రపోలేదు. మీ నటనను నమ్మలేక పోయానని నాకు చెప్పింది.” అని బీగ్‌బీ వెల్లడించారు.
READ MORE: Kantara: Chapter 1: కాంతార విజయం వెనుక రిషబ్ శెట్టి పేరు మార్పు కారణమా..?
కాగా.. ‘కాంతార చాప్టర్ 1’ పూర్తిగా రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షోనే. ఓ దర్శకుడిగా తను అల్లుకున్న కథ.. దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు.. ఓ నటుడిగా ఆ కథకు తను ప్రాణం పోసిన విధానం.. ప్రతిదీ నభూతో.. అన్న రీతిలోనే ఉంటుంది. ముఖ్యంగా రుద్ర గులిగలా.. ఈశ్వర గణంలా.. చండికలా తెరపై రిషబ్ చేసిన విన్యాసాలు పూనకాలు తెప్పించేలా ఉంటాయి. కనకావతి పాత్రలో రుక్మిణి స్క్రీన్ ప్రెజెన్స్.. భిన్న కోణాల్లో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచిన తీరు బాగుంది. జయరామ్ పాత్ర ఆరంభంలో మామూలుగా కనిపించినప్పటికీ.. పతాక ఘట్టాలు వచ్చే సరికి విశ్వరూపం చూపించారు.
