NTV Telugu Site icon

Amitabh Bachchan : ప్రభాస్ ‘కల్కి’ మూవీపై ప్రశంసలు కురిపించిన అమితాబ్ బచ్చన్..

Amithab Bachchan

Amithab Bachchan

Amitabh Bachchan : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’ ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన అశ్వద్ధామ గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అద్భుతమైన యాక్టింగ్ తో అమితాబ్ అదరగొట్టారు. “కల్కి 2898 AD ” సినిమాను జూన్‌ 27న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

Read Also :Canes Film Festival :బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకున్న మొదటి ఇండియన్ నటి ఎవరంటే..?

ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రంలోని ‘బుజ్జి’ క్యారెక్టర్ ను మేకర్స్ ఇటీవల పరిచయం చేసిన విషయం తెలిసిందే.బుజ్జి ఒక రోబోట్ కార్.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్.ఈ బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఇదిలా ఉంటే ‘కల్కి 2898’ చిత్రంపై అమితాబ్‌ బచ్చన్‌ ప్రశంసలు కురిపించారు.దర్శకుడు నాగ్‌అశ్విన్‌ అద్భుత ఆలోచనాశక్తి తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు.  షూటింగ్‌ చేస్తున్న సమయంలోనే కల్కి మూవీ భారీ విజయం సాధిస్తుందనే భావన కలిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ చాలా అద్భుతంగా అనిపిస్తాయి.. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రతి ఒక్కరూ ఎంతగానో ప్రశంసిస్తున్నారని తెలిపారు.ఈ సినిమాలో బుజ్జి పాత్ర ఒక అద్భుతమని అమితాబ్ తెలిపారు.

Show comments