2022 ఫిబ్రవరి 6న మరణించిన లతమంగేష్కర్ జ్ఞాపకార్థం ఆవిడ కుటుంబ సభ్యులు అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. 2023 నుండి లతమంగేష్కర్ జ్ఞాపకార్థం ఈ అవార్డులను వారి కుటుంబ సభ్యులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే 2023లో మొట్టమొదటిసారి అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి సంగీతానికి చేసిన కృషికి గాను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు కూడా దీననాధ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందుకోబోతున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు తెలిపారు.
Also read: KKR vs RR: ధోనీ, కోహ్లీలే నా ఇన్స్పిరేషన్: జోస్ బట్లర్
ఇక ఈ ఏడాది లతా దిననాథ్ మంగేష్కర్ అవార్డును బాలీవుడ్ బిగ్ బి ‘అమితాబచ్చన్’ కు ఈ అరుదైన గౌరవం దక్కనుంది. అమితాబచ్చన్ ను లత మంగేష్కర్ అవార్డుతో ఏప్రిల్ 24 న లతా మంగేష్కర్ తండ్రి దీననాథ్ వర్ధంతి సందర్భంగా సత్కరిస్తున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు తెలిపారు. e మేరకు మంగళవారం నాడు ఈ ప్రకటనను వెల్లడించారు.
Also read: The Greatest Of All Time : దళపతి విజయ్ మూవీలో విజయ్ కాంత్..క్రేజీ అప్డేట్ వైరల్..
వీటితోపాటు సామాజిక సేవా రంగంలో సేవలకు గాను ఎటువంటి లాభాపేక్ష చూడకుండా దీప్ స్తంభ్ ఫౌండేషన్ మనోబల్ కు కూడా ఈ అవార్డును అందజేయనున్నారు. వీరితోపాటు మరికొందరు ప్రముఖులకు కూడా ఇందుకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి హృదయనాథ్ మంగేష్కర్ అధ్యక్షత వహించడున్నాడు. ఇక ఈ అవార్డులను ఆశాభోంస్లే చేతుల మీదుగా ఇవ్వబోతున్నారు.
