Site icon NTV Telugu

Amitabh – Rajinikanth: ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసిన వేళ..

Rajanikanth Amithab

Rajanikanth Amithab

జైలర్ సినిమాతో ఫుల్ సక్సెస్ అందుకున్న రజనీకాంత్ ప్రస్తుతం ‘జై భీమ్’ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టైయాన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్, రక్షణ తదితరులు.. ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఇది రజనీకాంత్‌ కి 170వ సినిమా.

also read: AC For Buffaloes : ఆహా.. ఏమి సుఖం.. గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్.. వీడియో వైరల్..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అమితాబ్ శుక్రవారం నాడు ముంబైలో ఈ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ‘వెట్టైయాన్’ సెట్స్ నుండి అమితాబ్, రజనీల చిత్రాలను లైకా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇద్దరు భారతీయ సూపర్‌స్టార్లు ఒకే స్థలంలో స్టైలిష్‌ గా కనిపించడంతో ఈ చిత్రాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ ‘వెట్టైయాన్’ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నట్టు సమాచారం.

Exit mobile version