కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా విజయం సాధించారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానంలో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సోనాల్ రమణ్‌భాయ్ పటేల్‌పై 7 లక్షల ఓట్ల ఆధిక్యతతో అఖండ విజయం సాధించారు. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. అమిత్ షాకు మొత్తం 10,109, 72 ఓట్లు రాగా, పటేల్‌కు 2,66,256 ఓట్లు వచ్చాయి.
Read Also: Axis My India Exit Poll : ఎగ్జిట్ పోల్స్ విఫలమవ్వడంతో టీవీ షో మధ్యలో ఏడ్చిన సంస్థ ఎండీ
2019 లోక్‌సభ ఎన్నికల్లో గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి అమిత్ షా 5.57 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఒకప్పుడు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికవడం అమిత్ షాకు ఇది రెండోసారి. 1996లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఈ సీటును గెలుచుకున్నారు.
Read Also: Ponnam Prabhakar: బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి.. నైతికంగా గెలిచాం
గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు గాను ప్రస్తుతం బీజేపీ 23 స్థానాల్లో , కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ సూరత్ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఇప్పటికే ఈ స్థానం నుంచి పోటీ లేకుండా విజేతగా ప్రకటించారు. మరో బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా గుజరాత్‌లోని పోర్‌బందర్ లోక్‌సభ స్థానం నుండి 3.8 లక్షల ఓట్ల ఆధిక్యంతో సునాయాసంగా విజయం సాధించేందుకు సిద్ధంగా ఉన్నారు.