NTV Telugu Site icon

Amit Shah: తెలంగాణలో అమిత్ షా టూర్ షెడ్యూల్ ఖరార్

Amit Shah1

Amit Shah1

తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ విజయ శంఖారావం పూరించాలనే లక్ష్యంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటిస్తున్నారు. ప్రధాని మోడీ 9 ఏండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు మహాజన్ సంపర్క్ యాత్రలను ఎన్నికల శంఖారావ సభలుగా మార్చుకొనేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. ఈ నెలలో నిర్వహించే సభల్లో కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. జూన్ 15న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు.

Read Also : CM YS Jagan: చంద్రబాబు బతుకంతా వాగ్ధానాలు, వెన్నుపోట్లే.. సీఎం జగన్ ధ్వజం

త్వరలో కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనకు రానున్నారు. ఈమేరకు ఆయన షెడ్యూల్‌ ను బీజేపీ విడుదల చేసింది. ఈనెల 15వ తేదీన భద్రాచలంలో రాములవారి దర్శనంతో అమిత్ షా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. దీని కోసం ముందుగా ఈనెల 15న ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి షా చేరుకుంటారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు అల్పాహారం చేస్తారు.. ఈ సమయంలో ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి భద్రాచలానికి బయల్దేరి వేళతారు.

Read Also : Indigo: ఇండిగోలో తన వాటాను తగ్గించుకున్న సంస్థ సహ వ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్

భద్రచలంకు చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.20 మధ్యలో శ్రీరాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను కేంద్రమంత్రి అమిత్ షా చేస్తారు. తర్వాత ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు తిరిగి శంషాబాద్‌కు వచ్చి రాత్రి 7 గంటలకు పలువురు నేతలతో వేరు వేరుగా మీట్ అవుతారు. తిరిగి రాత్రి 9.40 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అమిత్‌ షా ఢిల్లీకి పయనమవుతారు.