Amit Sha Tour: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బుధవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. రేపు అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్నారు. అయితే అయిత్ షా పర్యటనలో భాగంగా దర్శక ధీరుడు రాజమౌళి నివాసానికి వెళ్లనున్నారు. అలాగే హీరో ప్రభాస్ తో కూడా అమిత్ షా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
Read Also: Rajnath Singh: ప్రియాంకా గాంధీ “సీజనల్ హిందువు”.. కేంద్రమంత్రి విమర్శలు..
అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఈ విధంగా ఉన్నాయి. రాజమౌళి నివాసంలో 11.45 నుంచి 12.15 వరకు ఉండనున్నారు. 12.45 నుంచి శంషాబాద్ జేడీ కన్వెన్షన్ లో పూర్వ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం భద్రాచలంకు వెళ్లనున్నారు. ఉదయం 4 గంటల నుంచి 4.40 వరకు శ్రీరాముల వారిని దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడి నుండి ఖమ్మంకి వెళ్లనున్నారు అమిత్ షా. సాయంత్రం 5.40- 5.55 వరకు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 6-7 గంటల వరకు ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభలో పాల్గొననున్నారు. 7.10 నుంచి 7.40 వరకు ఖమ్మం గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత రాత్రి 7.40కి ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లి.. అక్కడ నుంచి గుజరాత్ వెళ్లనున్నారు అమిత్ షా.
Read Also: Bhagavanth Kesari : భగవంత్ కేసరి స్ట్రీమింగ్ హక్కులను పొందిన ప్రముఖ ఓటీటీ సంస్థ..?
ఈనెల 15వ తేదీన ఖమ్మం బహిరంగ సభలో పాల్గొనాల్సిన అమిత్ షా.. ఒక్కరోజు ముందే వస్తున్నారు. తన పర్యటనలో పలువురు ప్రముఖులతో అమిత్ షా సమావేశం కానున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సినీ, రాజకీయ, మీడియా, క్రీడా రంగాల సెలబ్రిటీలతో పలు అంశాలపై షా చర్చించనున్నట్లు పేర్కొంటున్నాయి. ఇంతకు ముందు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిశారు. సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నితిన్, క్రికెటర్ మిథాలీ రాజ్ తదితరులను కలిసిన విషయం తెలిసిందే. మరి ఈసారి పర్యటనలో రాజమౌళి, ప్రభాస్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తుండగా.. మరికొందరిని కలుస్తారని టాక్ వినిపిస్తుంది. దీంతో అమిత్ షా ఎవరెవరిని కలుస్తారో అన్న అంశం ఆసక్తిగా మారింది.