NTV Telugu Site icon

Amit Shah On Reservations: రిజర్వేషన్లను తొలగిస్తామనేది పచ్చి అబద్దం.. మాకు 400 సీట్లు పక్కా..!

Amit Sha

Amit Sha

Amit Shah: 2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ ఓటింగ్ పూర్తైంది. ఇప్పుడు మూడో దశ ఓటింగ్ మే 7వ తేదీన జరగనుంది. ఇందుకోసం రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అస్సాంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న మాటలు నిరాధారమని అన్నారు. ఈ రెండు దశల తర్వాత, మా పార్టీ అంతర్గత అంచనా ప్రకారం.. బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి 100 స్థానాలను దక్కించుకున్నట్లు తెలుస్తుందన్నారు. ప్రజల ఆశీస్సులతో 400 సీట్లు దాటాలనే మా లక్ష్యం వైపు దూసుకుపోతున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.

Read Also: Himachal Pradesh : హిమాచల్‌లో వర్షం, హిమపాతం.. రోడ్డుపై నిలిచి పోయిన వేలాది వాహనాలు

అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని అమిత్ షా అన్నారు. SC,ST, OBCలకు రిజర్వేషన్లు ఉండటానికి బీజేపీ ఎప్పుడు మద్దతు ఇస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో తీవ్ర అన్యాయం చేసిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు.. దాని కారణంగా OBC రిజర్వేషన్లు తగ్గించబడ్డాయి.. ఆ తర్వాత కర్ణాటకలో రాత్రికి రాత్రే ఎలాంటి సర్వే లేకుండానే ముస్లింలందరినీ ఓబీసీ కేటగిరీలో పెట్టి వారికి 4 శాతం రిజర్వేషన్ కోటాను కేటాయించడం వల్ల వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లలో కూడా కోత విధించబడిందని అమిత్ షా వెల్లడించారు.

Read Also: TS SSC Results 2024: టెన్త్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ మొదలైన అన్ని రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విజయం సాధిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దీంతో పాటు సౌత్ ఇండియాలో కూడా బీజేపీకి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. 400 సీట్లు దక్కించుకోవాలనే లక్ష్యాన్ని కాంగ్రెస్ కొద్ది రోజుల నుంచి అసత్య ఆరోపణలు చేస్తుందని అని ఆయన తెలిపారు.