కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం లోఅమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణలో 35శాతం ఓట్ల తో 10 పార్లమెంటు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8కి వచ్చామన్నారు అమిత్ షా. ఇది వచ్చే ఎన్నికల్లో 64కావచ్చు .. 95 కూడా కావచ్చు అని, తెలంగాణలో భవిష్యత్తు బీజేపీ దేనని ఆయన ఉద్ఘాటించారు. బీఅర్ఎస్ మునిగింది.. కాంగ్రెస్ మునిగిపోయేందుకు సిద్దంగా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిందని, ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించింది… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి బిజెపి వస్తుంది… 64 రావచ్చు లేక 95 సీట్లు రావచ్చు అన్నారు.
Also Read : Teacher Unions: సీఎం క్యాంపు కార్యాలయానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు
ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లు సాధించి 10 సీట్లకు పైగా గెలుస్తామన్నారు. మా ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గానికి అండగా ఉంటుందని, మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేస్తామన్నారు. బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పార్టీలు అని, ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ నాది అని పనిచేయాలన్నారు. దేశం మనదేని పని చేయాలని, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేస్తే 400 పైచిలుక సీట్లు గెలుస్తామన్నారు. అంతేకాకుండా.. బీజేపీ శాసనసభ పక్షనేత ఎంపికపై అమిత్ షా సమావేశంలో చర్చ జరిగింది. బీసీ సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఫ్లోర్ లీడర్‌గా బీసీ ఎమ్మెల్యే ఉంటే బావుంటుందని అమిత్ షా అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. కాగా ఈ రేసులో బీసీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ ఉన్నారని సమాచారం. ఒకవేళ రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే రేసులో ఏలేటి మహేశ్వరరెడ్డి, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఉండే అవకాశం ఉంది.
Also Read : Teak Farming : టేకు మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..