NTV Telugu Site icon

Amit Shah: తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయి.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

Amit Sha

Amit Sha

తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయని.. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం బహిరంగ సభలో స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా భారీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్.. సోనియా కుటుంబం కోసం, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తుందని ఆరోపించారు. భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిందని.. అయితే, శ్రీరామనవమికి పాలకులు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ విస్మరించారని అమిత్ షా మండిపడ్డారు. కేసీఆర్ కారు భద్రాచలం వెళ్తుంది కానీ.. ఆలయం వరకు వెళ్లదన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉందని విమర్శించారు.

Chandrayaan-3: తొలిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రత వివరాలు పంపిన విక్రమ్

హైదరాబాద్ విముక్తికి 75 ఏళ్లు నిండాయని.. తెలంగాణ అమరవీరుల కలలను కేసీఆర్ కల్లలు చేశారని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ 4జీ పార్టీ, బీఆర్ఎస్ 2జీ పార్టీ, ఎంఐఎం 3జీ పార్టీ అంటూ కుటుంబ పార్టీలపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మోడీజీ పార్టీనేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయంటూ అబద్ధాలు చెబుతున్నారని అమిత్ షా మండిపడ్డారు. బీఆర్ఎస్, ఎంఐఎంలు కాంగ్రెస్ పార్టీతోనే కలిసి ఉన్నాయి. బీజేపీ ఎప్పుడూ.. బీఆర్ఎస్, ఎంఐఎంతో కలవదని అమిత్ షా స్పష్టం చేశారు. సీఎం అయ్యేది కేసీఆర్ కాదు.. కేటీఆర్ కాదు.. తెలంగాణలో వచ్చేది బీజేపీ సీఎం అని మరోసారి స్పష్టం చేశారు అమిత్ షా.

NTR: తారక్ మాటే నా మాట అంటున్న బాలయ్య..

కేసీఆర్ అవినీతిపై మాట్లాడితే బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు, ఈటల రాజేందర్ ను శాసన సభలో గొంతు నొక్కారని అమిత్ షా అన్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు. 22వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ వెచ్చిందని పేర్కొన్నారు. బడ్జెట్ లో మోడీ ప్రభుత్వం లక్షా25వేల కోట్లు రైతుల కోసం వెచ్చించిదని తెలిపారు. తెలంగాణలో వరిధాన్యం కేసీఆర్ 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే.. కేంద్రం 9లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తుందని అన్నారు. అంతేకాకుండా.. 11 కోట్ల రైతుల సంక్షేమం కోసం మోడీ బడ్జెట్ కేటాయించారన్నారు. 11 లక్షల మహిళలకు మోడీ ప్రభుత్వం గ్యాస్ పంపిణీ చేసిందని తెలిపారు. 2లక్షల 50 వేల మంది కోసం పేదలకు మోడీ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందని అమిత్ షా ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రైతు వ్యతిరేక, దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక, యువత వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ను ఇంటికి పంపి.. బీజేపీని అధికారంలోకి తీసుకొద్దాం అని తెలంగాణ ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు.

Show comments