NTV Telugu Site icon

Amit Shah : 400 సీట్ల గెలుపు దిశగా వెళ్తున్నాం..

Amit Shah

Amit Shah

ఇప్పటి వరకు మూడు దశలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 200 సీట్లలో విజయం సాధించనున్నామని ధీమా వ్యక్తం చేశారు అమిత్‌షా. ఇవాళ ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. 400 సీట్ల గెలుపు దిశగా వెళ్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం పైన పైసా కూడా అవినీతి చేయలేదని, అలసి పోగానే బ్యాంకాక్, థాయిలాండ్ ఎవరు వెళ్తారో మీకు అందరికీ తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. దీపావళి రోజు కూడా మోడీ సెలవు తీసుకోలేదని, ఓ వైపు ఇండి కూటమి.. మరోవైపు ఎన్డీయే కూటమి అని ఆయన అన్నారు. 12 లక్షల కోట్లు అవినీతి చేసిన వారు ఇండి కూటమిలో ఉన్నారని, 25 పైసల అవినీతి ఆరోపణలు చేయని ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని అమిత్‌ షా అన్నారు.

 

తెలంగాణలో పదమూడు స్థానాల్లో అనుకూలంగా ఉందని, పది స్థానాలు గెలవబోతున్నామన్నారు. సోనియమ్మ పుట్టిన రోజున రెండు లక్షల రుణమాఫీ అన్నాడని, ఇప్పటి వరకు రెండు రూపాయల మాఫీ కూడా చేయలేదని అమిత్‌ షా అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా మార్చుతున్నాడు రేవంత్ రెడ్డి అని, 4 జూన్ ఫలితాల్లో దక్షిణ భారతదేశంలో.. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు బీజేపీయే గెలువబోతోందన్నారు. తెలంగాణలో.. మేం 10కి పైగా సీట్లు గెలువబోతున్నాం. 13 సీట్లలో పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉందన్నారు అమిత్‌ షా.

 

Show comments