Site icon NTV Telugu

Amit Shah: నేడు లఖింపూర్ ఖేరీ-కన్నౌజ్‌లో అమిత్ షా ఎన్నికల ప్రచారం..

Amith Shah

Amith Shah

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ (బుధవారం) లఖింపూర్ ఖేరీ, హర్దోయ్, కన్నౌజ్‌లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొననున్నారు. నేటి ఉదయం 11 గంటలకు లఖింపూర్ ఖేరీలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాల మైదానంలో బీజేపీ అభ్యర్థి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెనీకి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షా ప్రసంగించనున్నారు. ఇక, మధ్యాహ్నం ఒంటి గంటకు హర్దోయిలోని సీఎస్‌ఎన్‌ పీజీ కళాశాలలో నిర్వహించే రెండో బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడనున్నారు. కాగా, నేటి మధ్యాహ్నం 3 గంటలకు తిర్వాలోని డీఎన్ ఇంటర్ కాలేజ్ హాస్టల్ గ్రౌండ్‌లో కన్నౌజ్ లోక్‌సభ అభ్యర్థి సుబ్రతా పాఠక్‌కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.

Read Also: Uttarakhand : అడవుల్లో మంటలు.. 30గ్రామాలకు కరువైన నిద్ర

అలాగే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం నేడు (బుధవారం) కాన్పూర్, ఎటా, షాజహాన్‌పూర్‌లలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. కాన్పూర్‌లోని ఘతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఖాళీ మైదానంలో మధ్యాహ్నం 12:40 గంటలకు వారి మొదటి సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ఫరూఖాబాద్ లోక్‌సభ బహిరంగ సభ మధ్యాహ్నం 2:25 గంటలకు ఎటాలోని అలీగంజ్‌లోని DAV ఇంటర్ కాలేజీలో ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం 3:50 గంటలకు రాంలీలా మైదాన్, కాంత్, దాద్రౌల్, షాజహాన్‌పూర్‌లో బహిరంగ సభలో యోగి ఆదిత్యానాథ్ పాల్గొని ప్రసంగించనున్నారు.

Exit mobile version