జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. బీసీలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మోసం చేశాయి..బీజేపీ ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఒకసారి దీపావళి జరుపుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. డిసంబర్ 3న బీజేపీ అధికారంలోకి వచ్చాక మరోసారి దీపావళి చేసుకుందామని అమిత్ షా అన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభమయ్యాక మూడోసారి దీపావళి చేసుకుందామని, బీజేపీ అధికారంలోకి అయోధ్యలో ఉచిత దర్శనం చేయిస్తామన్నారు అమిత్‌షా.
Also Read : Shahid Afridi: టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
అంతేకాకుండా..’పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ మాతో పోరాడారు.. దీనితో ప్రధాని ఇక్కడికే వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పడటంతో తెలంగాణ రైతుల ఆకాంక్షలు నెరవేరాయి… బీజేపీ అధికారంలోకి వస్తే మూతపడిన మూడు చక్కెర పరిశ్రమలను తెరిపిస్తాం… నిజామాబాద్‌లో 500 పడకలతో బీడీ కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మాణం చేపడతాం. కేసీఆర్ అమలు చేస్తున్న 4శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. ఉపాధి కోసం వలసవెళ్లిన వారి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అరవింద్ పోరాడుతున్నారు..తప్పకుండా ఏర్పాటు చేస్తాం… తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఓవైసీ భయపడి చేయడం లేదు… కుటుంబ పార్టీలు దేశానికి సమాజానికి చేటు చేస్తాయనే విషయాన్నిమీరు గమనించాలి… కారు స్టీరింగ్,కేసీఆర్,కవిత,కేటీఆర్ వద్ద కాదు..ఓవైసీ చేతిలో ఉంది.. ధర్మపురిని గెలిపించి అతనికి గొప్పపదవి ఇచ్చే అవకాశం కల్పిస్తారా… బీజేపీ అభ్యర్థులందరిని గెలిపిస్తారా.. డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తారా లేదా..అందరు చేతులెత్తి సమాధానం చెప్పండి…’ అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.
Also Read : Organic Farming Methods:సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు పొందవచ్చా?