Site icon NTV Telugu

Aamir Khan: ‘ధురంధర్‌’ కలెక్షన్స్‌పై ఆమిర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Aamir Khan

Aamir Khan

Aamir Khan: బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామి సృష్టించిన చిత్రం ‘ధురంధర్‌’. ఈ చిత్రం కేవలం వసూళ్లలోనే కాదు, రికార్డుల వేటలోనూ సరికొత్త చరిత్రను లిఖించింది. అదిత్య ధర్‌ దర్శకత్వంలో రన్‌వీర్‌ సింగ్‌ మెయిన్‌ రోల్‌లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజా ఈ చిత్ర కలెక్షన్స్‌పై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

READ ALSO: PNB Recruitment 2026: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5,138 పోస్టులు.. జస్ట్ డిగ్రీ ఉంటే చాలు..

ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు దక్కిన స్క్రీన్ల కంటే మరిన్ని థియేటర్లు అందుబాటులో ఉండి ఉంటే సినిమా వసూళ్లు ఊహకందని రీతిలో ఉండేవని అభిప్రాయపడ్డారు. చైనాలో దాదాపు లక్ష స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ మన దేశంలో ఆ సంఖ్య కేవలం 9 వేల లోపే ఉందని ఆయన గుర్తు చేశారు. గతేడాది చైనాలో విడుదలైన ‘నె ఝా 2’ అనే చిత్రం ఏకంగా 2 బిలియన్ డాలర్ల (రూ.18వేల కోట్లు పైచిలుకు) వసూళ్లను సాధించిందని, దానికి కారణం అక్కడ ఉన్న థియేటర్ల సంఖ్యేనని అన్నారు. ‘ధురంధర్‌’ 5 వేలకుపైగా స్క్రీన్లలో ప్రదర్శితమై 115 మిలియన్ డాలర్లు (రూ.1000 కోట్లు పైచిలుకు) సాధించింది, 15 వేల థియేటర్లలో రిలీజ్ అయి ఉంటే వసూళ్లు ఇంకా పెరిగేవి అని అన్నారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

READ ALSO: Healthy Breakfast: తక్కువ టైం.. ఎక్కువ హెల్త్! బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కి రాగి రొట్టె సూపర్ ఛాయిస్..

Exit mobile version