NTV Telugu Site icon

NEET: నీట్‌పై సోమవారం ఉన్నత స్థాయి కమిటీ తొలి భేటీ!

Neee

Neee

నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ సోమవారం తొలిసారి సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: రేపు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ

నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థి సంఘాలతో పాటు ఆయా విపక్ష పార్టీలు నిరసనలు, ధర్నాలు చేపట్టారు. కొద్ది రోజులుగా ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇంకోవైపు సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభలను ప్రతిపక్షాలు స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై కమిటీని నియమించింది. నీట్ పరీక్షలు సజావుగా నిర్వహించడం కోసం ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా విద్యాశాఖకు నివేదిక అందజేయాలని కేంద్రం ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Minister Gottipati Ravi: రామాపురం బీచ్‌లో వరుస ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష

హెచ్‌సీయూ వీసీ, ప్రొఫెసర్.బీజేరావు, ఐఐటీ మద్రాస్ ప్రొ.రామమూర్తి, కర్మయోగి భారత్ కో ఫౌండర్ పంకజ్ బన్సల్, ఐఐటీ ఢిల్లీ డీన్ ప్రొ.ఆదిత్య మిత్తల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్, ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా. రణ్‌దీప్ గులేరియా సభ్యులుగా ఉన్నారు.

ప్రవేశ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండటం కోసం ఈ కమిటీని ఏర్పాటుచేసినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌లో పురోగతి, జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయనుంది. రెండు నెలల్లోగా తన నివేదికను సమర్పిస్తుందని కేంద్రం తెలిపింది.

ఇది కూడా చదవండి: Cloudburst: అరుణాచల్‌లో ‘‘క్లౌడ్ బరస్ట్’’.. రాష్ట్రంలో భారీ వరదలు..