NTV Telugu Site icon

PM Modi: జమ్మూకాశ్మీర్ పరిస్థితులపై మోడీ సమీక్ష

Mdoe

Mdoe

కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాడ్డక జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నాలుగు రోజుల్లో 4 ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్‌ పరిస్థితులపై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌, జమ్మూ-కశ్మీర్‌ ఎల్జీ మనోజ్‌సిన్హాలతో మాట్లాడారు. స్థానికంగా భద్రత పరిస్థితులు, ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాల గురించి వారు ప్రధానికి వివరించారు. ఈ క్రమంలోనే ఉగ్ర నిరోధక సామర్థ్యాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Drinking Tea: టీ ఎక్కువగా తాగేస్తున్నారా.. ఈ సమస్యలతో సతమతమవ్వాల్సిందే..

యాత్రికులే లక్ష్యంగా ఇటీవల జమ్మూ-కశ్మీర్‌లోని పర్యటక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మంగళవారం సాయంత్రం కఠువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్‌లో ఒక ఇంటిపై దాడి జరిగింది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్‌ అమరుడైనట్లు అధికారులు తెలిపారు. దోడా జిల్లాలోని భదర్వా-పఠాన్‌కోట్‌ రహదారి సమీపంలోని ఒక చెక్‌పోస్టుపై మంగళవారం జరిగిన దాడిలో.. రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు సిబ్బంది, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. ఇదే జిల్లాలోని మరో ఘటనలో ఒక పోలీసు అధికారి గాయాలపాలయ్యారు.

ఇది కూడా చదవండి: Puri Jagannath Temple: తెరుచుకున్న జగన్నాధుడి ద్వారాలు.. ఆనందంలో భక్తులు..

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్‌ కుయుక్తులు పన్నుతోందని డీజీపీ ఆర్‌ఆర్‌ స్వైన్‌ ఆరోపించారు. శత్రుమూకలకు బుద్ధి చెప్పేందుకు బలగాలు సంసిద్ధంగా ఉన్నాయని స్పష్టంచేశారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారు పశ్చాత్తాపపడతారని.. పాకిస్థానీ ఉగ్రవాదుల మాదిరి కాకుండా.. వారికి ఇక్కడ కుటుంబాలు, స్థలాలు, ఉద్యోగాలు ఉన్నాయని ‘శత్రువు ఏజెంట్ల’ను ఉద్దేశించి హెచ్చరించారు. రియాసీ జిల్లాలో భద్రత పరిస్థితులపై డీజీపీ గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: జనసైనికులకు పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి.. 20 తర్వాత నేనే కలుస్తా..