సినిమా షూటింగ్‌లు అంటేనే రాత్రింబవళ్లు కష్టపడాలి.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. షూటింగ్ టైమింగ్స్, వర్కింగ్ అవర్స్ గురించి బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ (Yami Gautam) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. ముఖ్యంగా మహిళా నటుల విషయంలో ఇండస్ట్రీ చూపిస్తున్న వివక్షను ఆమె ఎండగట్టారు.
Also Read : Dhurandhar 2 Trailer :‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ వద్ద మళ్ళీ వసూళ్ల సునామీ గ్యారంటీ!
అందరికీ ఉన్నట్టే మాకూ పర్సనల్ లైఫ్ ఉంటుంది.. షూటింగ్‌లో ఎంత సేపు పని చేయాలనేది ముందే మాట్లాడుకుంటారు. ఇది కొత్తగా వచ్చిన డిమాండ్ ఏమీ కాదు.చాలా మంది హీరోలు ఎప్పటి నుంచో రోజుకు 8 గంటలు, వారానికి 5 రోజులు మాత్రమే పని చేస్తున్నారు. ఇది నటులు, నిర్మాతల మధ్య ఉండే అవగాహన. కానీ ఒక హీరోయిన్ అదే విషయాన్ని అడిగితే ఎందుకు అంత వివాదం చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఆమె సూటిగా ప్రశ్నించారు. అలాగే.. ‘కేవలం సినిమాల్లోనే కాదు, ఏ రంగంలో ఉన్నా మహిళలకు ‘తల్లి’ అయ్యే దశ చాలా కీలకం. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి లేదా ఇంట్లో ఉండే గృహిణికి ఎంత బాధ్యతలు ఉంటాయో, మాకూ అంతే ఉంటాయి. మాకు కూడా ఫ్యామిలీ లైఫ్ ముఖ్యం. షూటింగ్ లొకేషన్లు, పర్మిషన్ల వల్ల పక్కాగా టైమ్ మెయింటైన్ చేయడం కష్టమని మాకు తెలుసు.. కానీ కనీస సమయ పాలన కోరుకోవడంలో తప్పేముంది?’ అని ఆమె నిలదీశారు. పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ క్లోజ్ అయిపోతుందన్న భయం ఉన్న ఈ రోజుల్లో, యామీ గౌతమ్ లాంటి హీరోయిన్లు ఇలాంటి విషయాలపై ధైర్యంగా గళమెత్తడం విశేషం.
