NTV Telugu Site icon

Amethi Election : అమేథీలో స్మృతి ఇరానీ 47 వేల ఓట్లతో వెనుకంజ.. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీ లాల్ శర్మకు భారీ ఆధిక్యం

Smriti Irani

Smriti Irani

Amethi Election : అమేథీ లోక్‌సభ కేవలం యూపీలోనే కాకుండా దేశంలోనే అత్యంత హీట్ గా ఉండే స్థానాల్లో ఒకటి. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ మరోసారి పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఆమె వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ 47,424 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీపై స్మృతి విజయం సాధించింది. రాహుల్ ఈసారి ఎన్నికల్లో అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేశారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మకు అమేథీ గెలుపు బాధ్యతను కాంగ్రెస్ అప్పగించింది.

Read Also:TG Lok Sabha Result 2024: ఇప్పటి వరకు లీడ్ లో ఎవరు ఉన్నారంటే..

అమేథీలో 54.34శాతం ఓటింగ్
మే 20న అమేథీలో ఓటింగ్ జరిగింది. ఈసారి 54.34శాతం ఓటింగ్ జరిగింది. ఇప్పుడు ఫలితాల వంతు వచ్చింది. ప్రియాంక గాంధీ స్వయంగా ఇక్కడ కిషోరి లాల్ కోసం భారీ ప్రచారం చేశారు. రాహుల్, అఖిలేష్‌ల సంయుక్త ర్యాలీ కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అమేథీ ప్రజలు తమ ఎంపీగా ఎవరిని ఎన్నుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 2004, 2009, 2014 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి గెలిచి లోక్‌సభకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అప్పుడు బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ 50 వేలకు పైగా ఓట్లతో ఆయనను ఓడించారు.

Read Also:Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎక్కడంటే..?