US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో అనూహ్య ఘటన
- మహిళ దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా హంగామా
- ల్యాండ్ కాగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బాల్టిమోర్ నుంచి మియామీకి వెళ్తున్న విమానంలో ఓ మహిళ అకస్మాత్తుగా దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా తిరిగింది. విమానంలో అటు ఇటు తిరుగుతూ కేకలు వేసింది. దీంతో సహచర ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. అంతటితో ఆగకుండా తోటి ప్రయాణికుల ఎదుట అసభ్యంగా ప్రవర్తించడంతో విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. చివరకు విమానం మియామీ చేరుకున్న వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ AA1779లో సెప్టెంబర్ 11న ఈ ఘటన జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. బాల్టిమోర్/వాషింగ్టన్ ఇంటర్నేషనల్ థర్గుడ్ మార్షల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం రాత్రి 9 గంటల తర్వాత బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం బయలుదేరాల్సిన సమయం కంటే దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విమానం టేకాఫ్ అయింది. విమానం గాల్లో ఉండగా 9D సీటులో కూర్చున్న మహిళ తన దుస్తులన్నింటినీ తొలగించినట్లు ఇతర ప్రయాణికులు గుర్తించారు. అనంతరం ఆమె తోటి ప్రయాణికుల సమక్షంలో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విమాన సిబ్బంది గుర్తించారు.
Also Read
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
ఈ విషయాన్ని లీడ్ ఫ్లైట్ అటెండెంట్ వెంటనే కాక్‌పిట్ సిబ్బందికి తెలియజేశారు. అనంతరం విమాన సిబ్బంది, ఎయిర్‌లైన్ ఆపరేషన్స్ సెంటర్ మధ్య సమాచారం మార్పిడి జరిగింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విమానం మియామీ చేరుకున్న వెంటనే పోలీసులను సిద్ధంగా ఉంచాలని సిబ్బంది కోరారు. అయితే ఈ ఘటన కారణంగా విమానాన్ని దారి మళ్లించలేదు. విమానం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఫ్లోరిడాలోని మియామీ వైపు వెళ్లింది. ఇదే సమయంలో ఎయిర్‌లైన్ అధికారులు పోలీసు అధికారులతో సమన్వయం చేశారు. విమానం మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకునే సమయానికి పోలీసులు గేట్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. విమానం రాత్రి సుమారు 11.23 గంటలకు టెర్మినల్ ఎన్‌లోని గేట్ D2కి చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు విమానాల్లో ఉపయోగించే ఏసీఏఆర్ఎస్ (ACARS) కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా వెలుగులోకి వచ్చాయి. విమాన సిబ్బంది, ఎయిర్‌లైన్ మధ్య ఆపరేషనల్ సమాచారాన్ని పంపేందుకు ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఈ విమానం ఎయిర్‌బస్ A319. బాల్టిమోర్ నుంచి మియామీ వరకు ప్రయాణానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఈ విమానంలో గరిష్ఠంగా 160 మంది ప్రయాణికులున్నారు. అయితే విమానంలో సిబ్బంది ఆ మహిళను ఎలా నియంత్రించారు? ఇతర ప్రయాణికులకు ఆమె ప్రవర్తన వల్ల ఎంతవరకు ఇబ్బంది కలిగింది? ఆమె ఈ విధంగా ఎందుకు ప్రవర్తించింది? ఆమెపై ఎలాంటి కేసులు నమోదు చేశారు? వంటి వివరాలు వెంటనే వెల్లడికాలేదు. అలాగే ఆమె గుర్తింపును కూడా అధికారులు అధికారికంగా వెల్లడించలేదు.
తాజావార్తలు
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?