Site icon NTV Telugu

America: భారత్ లో ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసలు..

New Project (34)

New Project (34)

భారత్ లో సార్వత్రికి ఎన్నికలపై అమెరికా గతంలో ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని కొనియాడింది. ఆ దేశ వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్‌ను ప్రశంసించారు. “భారతీయులు ఓటు వేయడంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం ప్రశంసనీయం. భారతదేశంలో 96 కోట్ల మంది ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో భాగమవుతున్నారు. 2,660 గుర్తింపు పొందిన పార్టీల నుంచి అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. వేలాది మంది పోటీదారుల నుంచి 545 మంది పార్లమెంటు సభ్యులను ఎన్నుకోబోతున్నారు’ అని తెలిపారు. తాజాగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మరోసారి అమెరికా భారత్ ను ప్రశంసించింది.

READ MORE: OnePlus 12 Glacial White: మార్కెట్లోకి మరో కొత్త ఫోన్.. ఫీచర్స్ తెలుసుకుందామా..

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసలు కురిపించింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అభినందనలు తెలియజేసింది. ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు..? అన్న దానిపై తాము వ్యాఖ్యలు చేయబోమని, ఎవరు గెలిచినా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తామని పేర్కొంది.

READ MORE: Telangana Inter board: హిట్లర్ను మించిపోతున్న ఇంటర్ బోర్డు అధికారులపై జేఏసీ చైర్మన్ ఆరోపణలు..

‘భారీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వాన్ని, అందులో పాల్గొన్న భారత ఓటర్లను అభినందిస్తున్నాం. గెలుపోటములపై మేం స్పందించబోం. అది మా విదేశాంగ విధానం. ఎవరు గెలిచినా భారత ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగుతాయి’ అని ఆమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ అభిప్రాయపడ్డారు. భారత ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఆయా దేశాల్లోని పరిణామాలపై తాము సందర్భానుసారంగా స్పందిస్తామని తెలిపారు. అంతమాత్రాన అది జోక్యం చేసుకోవడం కాదని మిల్లర్‌ చెప్పారు. ఇదిలావుంటే ప్రధాని మోడీకి, ఎన్డీయే కూటమికి ‘యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌’ అభినందనలు తెలియజేసింది. భారత ఎన్నికల సంఘం తుది ఫలితాలను బుధవారం తెల్లవారుజామున ప్రకటించింది. అధికార భాజపా 240, కాంగ్రెస్‌ 99 స్థానాల్లో గెలుపొందాయి.

Exit mobile version