Site icon NTV Telugu

America: భారీగా వీసా ఫీజులు పెంచిన అమెరికా..

America

America

అగ్రరాజ్యం అమెరికా సర్కార్ హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 సహా ఇతర నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల ఫీజులను పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజా పెంపుతో భారతీయ టెక్కీలు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే హెచ్-1 బీ వీసా ఫీజు ప్రస్తుతమున్న 460 డాలర్ల నుంచి ఏకంగా 780 డాలర్లకు పెంచారు. అయితే, హెచ్‌–1బీ వీసా రిజిస్ట్రేషన్‌ ఫీజు కూడా 10 అమెరికన్‌ డాలర్ల నుంచి 215 డాలర్లకు పెరగనుంది.

Read Also: Revanth Reddy: నేడు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ..

అలాగే, రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంపు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది. అదే విధంగా, ఎల్‌–1 వీసా ఫీజు 460 డాలర్ల ఉండగా దాన్ని 1,385 డాలర్లకు, ఇన్వెస్టర్ల వీసాగా పిలిచే ఈబీ–5 కేటగిరీ వీసా ఫీజును ప్రస్తుతం ఉన్న 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచుతున్నట్లు ఫెడరల్‌ ప్రభుత్వం బుధవారం నాడు ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2016 తర్వాత తొలి సారిగా చేపట్టిన వీసా ఫీజుల పెంపు వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది.

Exit mobile version