NTV Telugu Site icon

Houthi Rebels: హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ బలగాలు ఎదురుదాడులు

America Britan

America Britan

Gaza–Israel conflict: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ బలగాలు ఎదురుదాడికి దిగాయి. రెండు దేశాల సైన్యాలు హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించే డజన్ల కొద్దీ స్థావరాలపై బాంబు దాడులు చేశాయి. హౌతీ రెబల్స్ కు చెందిన లాజిస్టిక్స్ హబ్‌లు, వాయు రక్షణ వ్యవస్థలతో పాటు ఆయుధాల కాష్‌లను లక్ష్యంగా చేసుకోని అమెరికా- బ్రిటన్ దళాలు టోమాహాక్ క్షిపణులు, ఫైటర్ జెట్‌లను ఉపయోగించాయి.

Read Also: Cow Record Milk: ఒకే రోజులో 80 లీటర్ల పాలు ఇచ్చి.. బుల్లెట్‌ బైక్‌ను సొంతం చేసుకున్న ఆవు!

ఇక, హౌతీ రెబల్స్ పై అమెరికా, బ్రిటన్ బలగాలు కలిసి తొలి సారి దాడి చేశాయి. హమాస్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులకు నిరసనగా హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవల ఎర్ర సముద్రంలో కార్గో షిప్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. దీంతో ఈ దాడులను ఆపాలని హౌతీ తిరుగుబాటుదారులను అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు వార్నింగ్ ఇచ్చాయి. కానీ, హాతీ రెబల్స్ మాత్రం అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా మరోసారి దాడులకు దిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్ర రాజ్యం.. బ్రిటన్ తో కలిసి ఈ దాడులను కొనసాగించింది.

Read Also: Hanuman: లెక్కల్ని తారుమారు చేస్తున్న సూపర్ హీరో…

ఇక, ఇక, హౌతీ రెబల్స్ పై అమెరికా, బ్రిటన్ దేశాలు ప్రతీకారంగా ఫైటర్ విమానాలతో పాటు 18 డ్రోన్లు, రెండు క్రూయిజ్ క్షిపణులతో పాటు ఒక యాంటీ షిప్ క్షిపణిని కూల్చివేశాయి. నిన్న హౌతీ తిరుగుబాటుదారులు గల్ఫ్ ఆఫ్ అడెన్‌లోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఇది ఓ వాణిజ్య ఓడను లక్ష్యంగా చేసుకుంది.. కానీ, ఎలాంటి నష్టం జరగలేదు. అయితే, నవంబర్ 19 నుంచి ఇప్పటి వరకు హాతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి మొత్తం 27 వాణిజ్య నౌకలపై దాడులు చేశారు.