Site icon NTV Telugu

Ameesha Patel : గదర్ 2 లో అలాంటి సన్నివేశం లేదు.. దయచేసి అలాంటి వీడియో వైరల్ చేయకండి…

Whatsapp Image 2023 07 16 At 12.37.25 Pm

Whatsapp Image 2023 07 16 At 12.37.25 Pm

తెలుగు సినిమాలలో కంటే కూడా హిందీ సినిమాలలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి.స్టార్ హీరోయిన్స్ కూడా ఆ ముద్దు సీన్స్ అలాగే బెడ్ రూమ్ సీన్స్ లో నటిస్తూ వుంటారు.ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం కోసం బాలీవుడ్ లో ప్రతి సినిమాలో తప్పకుండా అలాంటి సన్నివేశాలను యాడ్ చేస్తూ వుంటారు.ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ ల జోరు బాగా పెరిగింది. సినిమా థియేటర్ లలో విడుదల అయినా నాలుగు వారాలకే ఓటీటీ లో ప్రత్యక్షం అవుతుంది. దీనికి తోడు ఓటీటీ కి సెన్సార్ నిబంధనలు కూడా లేవు. దీనితో ఓవర్ గా వల్గర్ సీన్స్ అలాగే డైలాగ్స్ తో వెబ్ సిరీస్ లు తెరకెక్కి ఓటీటీ లో విడుదల అవుతున్నాయి. ఇటీవల అలాంటి వెబ్ సిరీస్ లు చాలానే వచ్చాయి. దీనితో ఓటీటీ లకు సెన్సార్ నిభందనలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇకపోతే తాజాగా సన్నీ డియోల్ మరియు అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో గదర్2 అనే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ మరియు బెడ్ రూమ్ సీన్స్ మరి ఎక్కువగా ఉన్నాయి అంటూ ఇటీవల పెద్ద ఎత్తున చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆగస్టు 11 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ మూవీలో సిమ్రత కౌర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఆమెకు సంబంధించిన ఒక బెడ్ రూమ్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో ఆ సన్నివేశం గదర్‌2 సినిమా లోనిదే అనే కామేంట్స్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. దాంతో తాజాగా ఆ కామెంట్స్ పై అమీషా పటేల్ స్పందించింది. ఇది గదర్‌2 సినిమాలోని సీన్ కాదు. సిమ్రత పై నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు..ఇలాంటి వీడియోలు దయచేసి వైరల్ చేయకండి సాటి ఆడదానిగా వేడుకుంటున్నాను అని అమీషా పటేల్ చెప్పుకొచ్చింది. కాగా అమీషా పటేల్ స్పందించిన తీరుపై నెటిజెన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.

Exit mobile version