Site icon NTV Telugu

Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్.. స్పందించిన బ్యూటీ!

Ameesha Patel

Ameesha Patel

Ameesha Patel: ప్రముఖ నటి అమీషా పటేల్‌పై మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో జరిగిన ఒక ఈవెంట్ వివాదంలో అమీషా పటేల్‌పై ఈ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెకు కోర్టు అనేకసార్లు సమన్లు ​​జారీ చేసినప్పటికీ ఆమె కోర్టు ముందు హాజరు కాకపోవడంతో తాజాగా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

READ ALSO: AP Speaker Ayyanna Patrudu: స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు.. ఆ ఎమ్మెల్యేలను రీకాల్‌ చేయాలి..!

పలు నివేదికల ప్రకారం.. 2017లో జరిగిన ఈవెంట్ వివాదంలో ఏమిటంటే.. ఈవెంట్ నిర్వాహకుడు పవన్ వర్మ నవంబర్ 16, 2017న జరిగిన ఒక వివాహంలో ప్రదర్శన కోసం అమీషాకు రూ.14.50 లక్షల అడ్వాన్స్ ఇచ్చారు. అలాగే మొరాదాబాద్‌లోని ఢిల్లీ రోడ్‌లోని ఒక లగ్జరీ హోటల్‌లో ఆమె కోసం ఏర్పాట్లు కూడా చేశారు. అయితే లాస్ట్ మినిట్‌లో ఆమె ఈవెంట్‌లో పాల్గొనడం లేదని పవన్ వర్మకు షాక్ ఇచ్చింది. అయితే తర్వాత, ఆమె తనకు పవన్ వర్మ ఇచ్చిన పూర్తి డబ్బు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది. కానీ రూ.10 లక్షలు నగదు రూపంలో తిరిగి ఇచ్చి, మిగిలిన రూ.4.50 లక్షలకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఆయన అమీషాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు నుంచి పలుమార్లు ఆమెకు సమన్లు ​​జారీ చేశారు. అయినా కూడా అమీషా కోర్టుకు హాజరు కాలేదు. దీనితో తాజాగా కోర్టు ఆమె హాజరును నిర్ధారించడానికి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ వివాదంపై అమీషా తరపు న్యాయవాది అభిషేక్ శర్మ స్పందిస్తూ.. ఈ విషయం 2017 నాటిదని, ఇప్పటికే ఒక ఒప్పందం ద్వారా ఈ సమస్య పరిష్కారం అయ్యిందని తెలిపారు. ఒప్పందం ప్రకారం.. అమీషా పవన్ వర్మకు పూర్తి మొత్తాన్ని తిరిగి ఇచ్చిందని ఆయన తెలిపారు.

వివాదంపై అమీషా పటేల్‌ వివరణ ఇదే..
ఈ వివాదంపై తాజాగా అమీషా పటేల్‌ సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. ‘పవన్ వర్మతో ఆర్ధిక గతంలోనే ఈ లావాదేవీలకు సంబంధించి సెటిల్‌మెంట్ పూర్తి అయింది. ఆ మేరకు పవన్ వర్మ డీడ్‌పై సంతకం కూడా చేశాడు. తను అంగీకరించిన మొత్తాన్ని ఆయనకు ఎప్పుడో చెల్లించాను. అయినప్పటికీ అతను ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తూ, కేసులు నమోదు చేసినట్లు కనిపిస్తోంది. నా న్యాయవాదులు తను నాపై చేస్తున్న మోసానికి తగిన క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికైనా ఆయన తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి’ అని అమీషా పేర్కొన్నారు.

READ ALSO: Salim Khan: ఖాన్ ఫ్యామిలీలో విషాదం.. ఐసీయూలో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి!

Exit mobile version