Ameesha Patel : ఓటీటీ ల పై షాకింగ్ కామెంట్స్ చేసిన అమీషా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడం జరిగింది.దీనితో దేశం మొత్తం దుర్భర స్థితిని అనుభవించింది.ప్రజలు అందరూ తమ ఇంటిలోనే ఉండిపోయారు.థియేటర్లన్నీ కూడా మూతపడటంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం ఓటీటీ లు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఓటీటీల ద్వారా ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి .ఓటీటీల లో ప్రసారమయ్యే సినిమాలు మరియు వెబ్ సిరీస్ లకు ఎలాంటి సెన్సార్ నిబంధనలు లేవు.సెన్సార్ లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు వరుసగా విడుదల అవుతున్నాయి.దీంతో చాలామంది సెలబ్రిటీలు ఈ ఓటీటీల గురించి వారి అభిప్రాయాలను తెలియజేసారు.. ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ నటి అమీషా పటేల్ కూడా ఓటీటీల గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసారు.ప్రస్తుతం ఆ కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.అమీషా పటేల్ తెలుగు మరియు హిందీ భాషలలో హీరోయిన్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది.హీరోయిన్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది.అయితే ఈమె కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.. అయితే ఈ భామ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.
ప్రస్తుతం అమీషా పటేల్ పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె నటించిన గదర్ 2 సినిమా విడుదలకు రెడీ ఉంది.. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉన్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అమీషా పటేల్ తాజాగా ఓటీటీల గురించి షాకింగ్ కామెంట్స్ ను చేశారు. ఈ సందర్భంగా ఈమె ఓటీటీల గురించి మాట్లాడుతూ.ప్రస్తుతం ఓటీటీల్లో క్లీన్ కంటెంట్ కంటే కూడా బోల్డ్ కంటెంట్ ఎక్కువైపోయింది అని సంచల కామెంట్స్ చేసింది. అంతే కాదు ఇలాంటి వాటిని చూడకుండా పిల్లలను దూరంగా ఉంచాలని ఆమె తెలిపింది.అయితే ఇవి పిల్లలకు బాగా అందుబాటులో ఉన్నాయని కూడా ఆమె తెలిపారు. ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు వెబ్ సిరీస్ లు చూడటం వల్ల పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది అంటూ ఈమె చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!