Ambati Rambabu:ఎన్డీవీతో క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సానుభూతి కోసం పాకూలాడేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు అని తెలిపారు. మాకు సానుభూతి అవసరం లేదు.. ఎందుకంటే మా నాయకుడు ( జగన్ ) ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించారు.. ఆ ధీమాతోనే మేమే ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నాం.. కానీ, సీఎం జగన్ పై కుట్రపూరితంగానే రాయితో దాడి చేశారని అంబటి రాంబాబు తెలిపారు.
Read Also: Questionhour With Ambati Rambabu Live: మంత్రి అంబటి రాంబాబుతో క్వశ్చన్ అవర్..
చంద్రబాబు నాయుడు నటనలో చాలా గొప్పవారు అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్ పై రాయి వేయించి ఏదో చేయాలని భావించారు అన్నారు.. అలాగే, గతంలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నా సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగింది.. దాని మీద ఆరోపణలు, ప్రత్యఆరోపణలు ఉన్నాయి.. అది కోర్టు పరిధిలో ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ వస్తున్నప్పుడు సెక్యూరిటీ కోసం పోలీసులు తీసుకున్న జాగ్రత్తలపై కూడా టీడీపీ అనేక ఆరోపణలు చేసింది.. కానీ, ఇప్పుడు రోడ్డుపై వస్తున్న మా నేతపై చంద్రబాబు ఆలోచనలో నుంచే పుట్టింది.. ఈ కుట్ర అని మండిపడ్డారు. జగన్ పై దాడిలో భద్రతా లోపం ఏం లేదు.. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా బాంబ్ బ్లాస్ట్ అయింది.. అది భద్రతా లోపమా అంటూ ప్రశ్నించారు. అయితే, ఐదేళ్ల పాలనలో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.