NTV Telugu Site icon

Amazon Smart TV Offers: అమెజాన్‌లో 54 శాతం డిస్కౌంట్ ఆఫర్.. 10 వేలకే 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీ!

Skywall 40 Inches Full Hd Led Smart Tv

Skywall 40 Inches Full Hd Led Smart Tv

Purchase SkyWall 40 inches Full HD LED Smart TV Just Rs 11499 in Amazon. ‘స్మార్ట్‌టీవీ’ కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలోనే పెద్ద టీవీని మీరు సొంతం చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో కళ్లు చెదిరే డీల్ ద్వారా స్మార్ట్‌టీవీని సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీని కేవలం రూ. 10 వేలకే మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఇంత తక్కువ ధరలో స్మార్ట్‌టీవీ వస్తుంది కాదా?.. ఏ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ ఉండుంటుంది అని అనుకుంటే మీరు పొరబడినట్టే.

అమెజాన్‌లో స్కైవాల్ స్మార్ట్‌టీవీ (SKYWALL 40 inches Full HD LED Smart TV 40SWFHS Black) అసలు ధర రూ. 25,270గా ఉంది. అయితే మీరు ఈ స్మార్ట్‌టీవీని ఇప్పుడు రూ. 11,499కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌ నేరుగా 54 శాతం డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. దాంతో మీరు రూ. 13,771 ఆదా చేసుకోవచ్చు. ఈ మొత్తం మీకు ఎక్కువ అనుకుంటే.. బ్యాంకు ఆఫర్ కూడా ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ. 1362 డిస్కౌంట్ వస్తుంది.

సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా స్కైవాల్ స్మార్ట్‌టీవీని కొనునుగోలు చేస్తే.. రూ. 10,136కే మీ సొంతం అవుతుంది. అంటే రూ. 10 వేల బడ్జెట్‌లోనే కళ్లుచెదిరే 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీని కొనేసుకోవచ్చు. ఈ టీవీపై ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా ఉంది. రూ. 3,500 వరకు ఎక్స్‌ఛేంజ్‌ తగ్గింపు లభిస్తోంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలవారీ ఈఎంఐ రూ. 550 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. 12 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1043 చెల్లించాలి. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 723 కట్టాల్సి ఉంటుంది.

Also Read: Heath Streak Alive: థర్డ్ అంపైర్ వెనక్కి పిలిచాడు.. జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్‌ స్ట్రీక్‌ చనిపోలేదు!

స్కైవాల్ 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీలో మంచి అప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ టీవీ. 1 జీబీ ర్యామ్, 1 జీబీ మెమరీ ఉంటుంది. మీరా కాస్ట్, 30 వాట్ స్పీకర్లు వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ టీవీలో మీరు పలు రకాల యాప్స్ కూడా చూడొచ్చు. సబ్‌స్క్రిప్షన్ ఉంటే.. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, సోలీ లివ్ వంటి యాప్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు.

Show comments