Site icon NTV Telugu

Amazon Prime subscription price: అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరిగిన సబ్‌స్క్రిప్షన్‌ ధర

Amazon Prime

Amazon Prime

Amazon Prime subscription price: క్రమంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి డిమాండ్‌ పెరుగుతోంది.. పెద్ద సినిమాలు సైతం నెల, రెండు నెలల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి.. ఇక, చిన్న సినిమాలు వారం పది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. అంతెందుకు.. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజయ్యే సినిమాలో ఎన్నో ఉన్నాయి.. దీంతో.. సినిమా థియేటర్‌కు ఏం వెళ్తాంలే.. ఇంట్లోనో సినిమా చూసుకోవచ్చు అనే ధోరణి కూడా పెరుగుతోంది.. అయితే, ఇది క్యాష్‌ చేసుకునే పనిలోపడిపోయాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు.. క్రమంగా సబ్‌స్ర్కిప్షన్‌ ధరలను పెంచుతూ పోతున్నాయి.. భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధర మరోసారి పెంచేసి యూజర్లకు షాకిచ్చింది.. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను ఏకంగా 67 శాతం మేర పెంచేసింది. త్రైమాసిక ప్లాన్‌ను కూడా సవరించింది. కానీ, వార్షిక ప్లాన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.. ఇక, పెంచిన ధరలు వెంటనే అమల్లోకి తెచ్చింది అమెజాన్‌.

Read Also: JioCinema: జియో సినిమా బిగ్ డీల్.. ఇకపై హెచ్‌బీఓ , వార్నర్ బ్రదర్స్ కంటెంట్..

పెరిగిన సబ్‌స్ర్కిప్షన్‌ ధరల విషయానికి వస్తే.. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ నెలవారీ చందా ఇప్పటి వరకు రూ.179గా ఉండగా.. ఇప్పుడు ఏకంగా అది రూ.299కు చేరింది.. ఇక, 3 నెలల చందా ఇప్పటి వరకు రూ.459గా ఉంటే.. దానిని రూ.599కు పెంచేసింది.. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ రూ.1499 ఉండగా.. అందులో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు ఆ సంస్థ.. అయితే, ఇప్పటికే సబ్‌స్క్రైబ్‌ అయిన వారికి 2024 జనవరి 15 వరకు పాత రేట్లే వర్తింపజేయనున్నారు.. కానీ, ఏదైనా కారణంతో రెన్యువల్‌ ఫెయిల్‌ అయితే మాత్రం కొత్త ధర వర్తింపజేయనున్నారు.. ఇక, అమెజాన్‌ లైట్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను రూ.999కు లభిస్తోంది. ఇందులోనూ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌లో ఉండే అన్ని సదుపాయాలూ ఉంటాయి.. కానీ, ప్రైమ్‌ వీడియో కంటెంట్‌ను ఎస్‌డీ క్వాలిటీలో చూడ్డానికి మాత్రమే వీలవుతుంది.. హెచ్‌డీ సదుపాయం ఉండదన్నమాట.. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను 2016లో భారత్‌లో ప్రవేశపెట్టగా.. నెలవారీ చందా సదుపాయాన్ని మాత్రం 2018లో తీసుకొచ్చింది.

Exit mobile version