Khauf: OTTలో ఈ హర్రర్ సిరీస్‌ను చూశారా? వెన్నులో వణుకు పుట్టాల్సిందే..
Khauf: వీకెండ్ మొదలైంది. ఈ వీకెండ్‌కు ఇంట్లోనే ఉండి ఓటీటీలో మంచి థ్రిల్లర్ సిరీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. ఇటీవల ‘అమెజాన్ ప్రైమ్’ వీడియోలో విడుదలైన ఒక సిరీస్ ఇప్పటికీ సంచలనం సృష్టిస్తోంది. ఇది ప్రేక్షకులకు వెన్నులో వణుకుపుట్టేలా చేస్తోంది. ఈ సిరీస్ విడుదలైనప్పటి నుంచి అనేక ప్రశంసలను అందుకుంది. ఈ సిరీస్ పేరు “ఖౌఫ్”. ఈ హర్రర్ సిరీస్‌ను స్మితా సింగ్ రూపొందించారు. మోనికా పవార్, రజత్ కపూర్, చుమ్ దరాంగ్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ బాగా ప్రశంసలు అందుకుంది. IMDbలో 7.1 రేటింగ్‌ను కలిగి ఉంది. ‘ఖౌఫ్’ సిరీస్, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ‘అమెజాన్ ప్రైమ్’ ద్వారా అందుబాటులోకి వచ్చింది.
READ MORE: Chiranjeevi-Pawan Kalyan :మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. చిరు–పవన్ నుంచి వరుస అప్డేట్స్
కథ ఏంటి.?
మాధురి అనే విద్యార్థిని ఎన్నో కలలతో ఢిల్లీ చేరుకుంటుంది. సిటీలోని హాస్టల్‌లో ఉండేందుకు ఆమె వద్ద తగినంత డబ్బు ఉండదు. దాంతో నగర శివారులోని ఓ హాస్టల్‌లో చేరుతుంది. వాస్తవానికి.. నిక్కీ, స్వెత్లాన, కోమలి, రీమా ఒక రూములోనే ఉంటారు. రీమా గర్భవతి అయినప్పటికీ, అత్తింటి వారి టార్చర్ కారణంగా హాస్టల్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటుంది. వారికి ఎదురు రూములో ఉండే ‘అనూ’ 6 నెలల క్రితం చనిపోతుంది. అప్పటి నుంచి ఆ రూములో ప్రేతాత్మ ఉందని వాళ్లంతా భయపడుతూ ఉంటారు. గ్వాలియర్ కి చెందిన మాధురి, ఢిల్లీలో ఉండే అరుణ్ ప్రేమించుకుంటారు. ఒకసారి వాళ్లిద్దరూ కలిసి ఉన్నప్పుడే ముగ్గురు ముసుగు వ్యక్తులు దాడి చేస్తారు. అదే సమయంలో మాధురి రేప్ కి గురవుతుంది. ఆ సంఘటనను మరిచిపోవడానికిగాను మాధురిని కూడా ఢిల్లీ రమ్మంటాడు అరుణ్. దాంతో ఆమె ఢిల్లీ వెళ్లి అక్కడ జాబ్ సంపాదిస్తుంది. ఆ విషయంలో ఆమెకి ‘బేలా’ .. ఆమె బాయ్ ఫ్రెండ్ ‘నకుల్’ సాయపడతారు. ఆ జాబ్ చేస్తూ ఆమె వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో .. గతంలో ‘అనూ’ ఉన్న రూములోనే దిగుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.
తాజావార్తలు
-
May 1 Releases : పెద్ది పోస్ట్ పోన్.. మేడే కోసం క్యూ కట్టిన సినిమాలు
-
Ruturaj Gaikwad: “ఆ 2 ఓవర్లే మా కొంపముంచాయి”.. సన్‌రైజర్స్‌తో ఓటమిపై రుతురాజ్ గైక్వాడ్
-
NBK : యంగ్ డైరెక్టర్స్ ఫోకస్ అంతా ప్రజెంట్ బాలకృష్ణపైనే
-
Char Dham Yatra: హిమాలయాల్లో ఆధ్యాత్మిక శోభ.. తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ద్వారాలు!
-
Praful Hinge: తొలి ఓవర్‌లో 15 రన్స్.. చివరి ఓవర్‌లో కట్టడి.. మరోసారి నిరూపించుకున్న ప్రఫుల్ హింగే!
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!