చాలా మంది కొత్త సంవత్సరంలో కొత్త కొత్త వస్తువులు కొనాలని చూస్తుంటారు. కొందరు టూవీలర్స్, స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే తాము కొనుగోలు చేయాలనుకునే ప్రొడక్ట్స్ పై ఆఫర్స్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. అంతేకాదు తక్కువ ధరలో క్వాలిటీ, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండాలని చూస్తుంటారు. మరి మీరు కూడా మీ ఇంట్లోకి కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా?, తక్కువ ధరలో లేటెస్ట్ ఫీచర్స్ ఉండాలని కోరుకుంటున్నారా?.. అయితే మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ టీవీపై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ. 25 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ. 14 వేలకే మీ సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ లో షియోమీ కంపెనీకి చెందిన షియోమీ స్మార్ట్ టీవీ A సిరీస్ (Xiaomi Smart TV A Series) 32 అంగుళాల స్మార్ట్ టీవీపై ఏకంగా 44 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 24, 999గా ఉంది. ఆపర్లో భాగంగా ఈ రూ. 13, 999కే వచ్చేస్తోంది. అంటే మీకు రూ. 11 వేలు ఆదా అవుతోంది. మీరు బ్యాంక్ ఆఫర్స్ ను యూజ్ చేసుకుని కొనుగోలు చేసినట్లైతే.. మరో రూ.1500 తగ్గింపు పొందొచ్చు. అప్పుడు మీరు ఈ స్మార్ట్ టీవీని రూ.12,500 కే దక్కించుకోవచ్చు. బ్రాండెడ్ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీపై ఇంతకంటే బెస్ట్ డీల్ ఉండదనే చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే షియోమీ స్మార్ట్ టీవీ Aపై ఓ లుక్కేయండి.
Also Read: Mohan Babu: గతం గతః.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్!
ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎల్ ఈడీ డిస్ల్పేతో వస్తుంది. 720పీ రెసొల్యూషన్, 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. క్విక్ వేక్, క్విక్ మ్యూట్, క్విక్ సెట్టింగ్ మెను స్పెషల్ ఫీచర్స్ ను అందించారు. వైఫై, ఈథర్ నెట్, యూఎస్బీ, హెచ్ డీఎంఐ కనెక్టివిటీ టెక్నాలజీని కలిగి ఉంది. వన్ క్లిక్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ+హాట్ స్టార్, గూగుల్ అసిస్టెంట్, వాయిస్ అసిస్టెంట్ ఇంటర్నెట్ సర్వీసెస్ కు సపోర్ట్ చేస్తుంది. థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చేలా డాల్బీ ఆడియోను అందించారు. 20 వాట్స్ అవుట్ పుట్ సౌండ్ ఇస్తుంది. బెజెల్ లెస్ డిజైన్ ను కలిగి ఆకర్షనీయంగా ఉంటుంది. బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.