Amazon Offers: కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఈ స్మార్ట్‌ టీవీపై 30 వేల తగ్గింపు!

  • పెరిగిన స్మార్ట్‌ టీవీల వినియోగం
  • అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్
  • బ్లాపుంక్ట్‌ స్మార్ట్‌ టీవీలో 30 వేల తగ్గింపు
Blaupunkt 50 Inches Smart Tv

Blaupunkt 50 Inches Smart Tv

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వచ్చాక స్మార్ట్‌ టీవీల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇంట్లోనే బిగ్ స్క్రీన్స్‌లో సినిమాలను వీక్షించే వారి సంఖ్య ప్రస్తుతం పెరుగుతోంది. వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు తక్కువ ధరలో స్మార్ట్‌ టీవీలను రిలీజ్ చేస్తున్నాయి. అందులోనూ ఇ-కామర్స్‌ సంస్థలు స్మార్ట్‌ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. దాంతో తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ టీవీని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. తాజాగా అమెజాన్‌లో ఓ బెస్ట్‌ డీల్‌ ఉంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

బ్లాపుంక్ట్‌ 50 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ.49,999గా ఉంది. ప్రస్తుతం ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ టీవీపై 42 శాతం డిస్కౌంట్‌ ఉంది. దాంతో రూ.21 తగ్గింపు అనంతరం.. రూ.28,999కే లభిస్తోంది. ఐసీఐసీ కార్డుతో కొనుగోలు చేస్తే.. దాదాపుగా రూ.1000 వరకు అదనంగా డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ టీవీని కేవలం రూ.28 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ త్వరలో ముగియనుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవారు వెంటనే కొనేసుకోండి.

Also Read: Jasprit Bumrah: కొత్త సంప్రదాయానికి ఇది ప్రారంభం: బుమ్రా

బ్లాపుంక్ట్‌ 50 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీలో క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 4కే రిజల్యూషన్‌ స్క్రీన్‌, 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. డీటీఎస్‌ ట్రూ సరౌండ్‌ స్పీకర్లతో వస్తోంది. సైబర్‌ సౌండ్‌ జెన్‌ 2 టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇందులో వైఫై, యూఎస్‌బీ, ఇథర్‌ నెట్‌, హెచ్‌డీఎమ్‌ఐ వంటి ఫీచర్స్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌వీడియో, యూబ్యూట్‌, యాపిల్‌ టీవీ, డిస్నీ+హాట్‌స్టార్‌ వంటి ఇన్‌బిల్ట్‌ యాప్స్‌ ఉంటాయి.