NTV Telugu Site icon

Amazon Offers: అమెజాన్‌ ‘గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌’ సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌!

Iphone 13 And Oneplus 12r

Iphone 13 And Oneplus 12r

Amazon Offers on Samsung Galaxy S24 5G and OnePlus Nord CE 4 Lite: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సంస్థ ‘గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌’ను నిర్వహిస్తోంది. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 15 వరకు ఈ సేల్‌ అందుబాటులో ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రైమ్‌ మెంబర్లకు ఈ సేల్‌ అందుబాటులోకి రాగా.. మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి సాధారణ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో భాగంగా యాపిల్‌, వన్‌ప్లస్‌, శాంసంగ్‌, పోకో, ఐకూ వంటి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాదు ఎస్‌బీఐ కార్డు కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.

అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా ఐఫోన్ 13 (128 జీబీ) రూ.47,999కే లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.59,600 ఉండగా.. 18 శాతం డిస్కౌంట్‌ ఉంది. అంతేకాదు ఎస్‌బీఐ కార్డు కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ ఉంది. వన్‌ప్లస్‌ 12ఆర్‌ (8జీబీ+128జీబీ) రూ.39,999కే లభిస్తుంది. శాంసంగ్‌ ఎస్‌24 5జీ (8జీబీ+128జీబీ) రూ.74,999కు కొనుగోలు చేయొచ్చు.

Also Read: Hockey India: జర్మనీతో ఢీ.. ఫైనల్‌పై భారత్‌ కన్ను! రీల్ ‘విలన్‌’ రియల్ అయ్యాడు

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.16,999, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ 5జీ రూ.24,999లకు కొనుగోలు చేయొచ్చు. ఇటీవల లాంచ్‌ అయిన వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 (రూ.27,999), లావా బ్లేజ్‌ ఎక్స్‌ (రూ.13,249) పైనా ఆఫర్లు ఉన్నాయి. మరికొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై కూడా అమెజాన్‌ డిస్కౌంట్‌ ప్రకటించింది.

 

Show comments