అయితే డబ్బులు ఉన్న వాళ్ల జీవితం బిందాస్ గా ఉంటుంది. వాళ్లు ఉపయోగించే ప్రతీ వస్తువు ఖరీదైనదేనని అనుకుంటారు. అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తే చాలు. పలాన హీరో ధరించిన టీ షర్ట్ ధర ఎంతో తెలుసా.. ఆ హీరోయిన్ బ్యాండ్ బ్యాగ్ రేట్ ఎంతో తెలుసా అంటూ వివిధ కథనాలు హోరెత్తుతుంటాయి. సోషల్ మీడియాలోనూ వీటిపై చర్చ జరుగుతుంది. అయితే తాజాగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ధరించిన ఓ షర్ట్ పై సోషల్ మీడియాలో సెమ్ ఇలాంటి చర్చే జరుగుతుంది.
Read Also : WTC Final 2023: ఎంఎస్ ధోని వల్లే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు రహానే..!
కొన్ని లక్షల కోట్ల ఆస్తికి అధిపతి అయిన జెఫ్ బెజోస్ అంత అక్కువ ధర షర్ట్ వేసుకోవం ఏంటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే జెఫ్ బెజోస్ ఇటీవల జరిగిన కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివర్ లో పాల్గొన్నాడు. తన ప్రేయసితో కలిసి ఈవెంట్ కు హాజరయైన బెజోస్ ఉత్సాహంగా డ్యాన్స్ కూడా వేశాడు. ఈ సందర్భంగా తీసిన కొన్ని వీడియోలు.. ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఫోటోలను చూసిన నెటిజన్స్ జెఫ్ బెజోస్ షర్ట్ ఆకర్షించింది.
Read Also : CM KCR: వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తాం.. జాగ్రత్తగా పనిచేయండి
బటర్ ఫ్లైస్ ప్రింటింగ్ తో ఉన్న సదరు షర్ట్ రేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెజోష్ ధరించిన షర్ట్ అమెజాన్ లో 12 డాలర్లకు అందుబాటులో ఉందని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. మన కరెన్సీలో చెప్పాలంటే ఆ షర్ట్ విలువ కేవలం రూ. 980 మాత్రమే.. ఇంకేముంది ఈ పోస్ట్ కాస్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. అన్ని లక్షల కోట్ల ఆస్తులున్న వ్యక్తి సింప్లిసిటీ బాగుంది అని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
