Health Tips: రోజుకు ఒక్కటి తింటే చాలు..ఆ సమస్యలు దూరం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉసిరికాయల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… విటమిన్ సి అధికంగా ఉండే వాటిలో ఇవి ఒకటి..శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాదు.. మరెన్నో సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి..కంటిచూపు మెరుగుపడుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి. రోజుకు ఒక ఉసిరికాయను తప్పకుండా తీసుకోవాలని మనకు వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే ఇవి మనకు సంవత్సరమంతా లభించవు.. కొంతమంది పచ్చళ్ళు పెట్టుకుంటే, మరికొంతమంది మూర్బా చేసుకొని రోజు తీసుకుంటారు.. ఎలా తీసుకున్నా మంచి ఆరోగ్యమే.. ఈ మర్బాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావల్సిన పదార్థాలు..
Also Read
పెద్ద ఉసిరికాయలు – 500 గ్రా.,
కండ చక్కెర – అరకిలో,
నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్,
యాలకుల పొడి – అర టీ స్పూన్,
సైంధవ లవణం – అరటీ స్పూన్,
శొంఠి పొడి – అర టీ స్పూన్,
మిరియాల పొడి – అర టీ స్పూన్..
తయారీ విధానం :
ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి..అవి మునిగే వరకు నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. తరువాత వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ ఉసిరికాయలతో ఫోర్క్ తో లేదా చాకుతో చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. తరువాత ఈ ఉసిరికాయలను అవిరి మీద 20 నిమిషాల పాటు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత వీటిని తీసి పూర్తిగా చల్లారే వరకు పక్కకు ఉంచాలి. ఇప్పుడు కండ చక్కెరను పలుకులుగా చేసుకుని జార్ లో వేసి మెత్తనిపొడిలా చేసుకోవాలి. ఈ మురబ్బాను తయారు చేసుకోవడానికి గానూ కేవలం స్టీల్ గిన్నెను లేదా నాన్ స్టిక్ కళాయిని మాత్రమే వాడాలి.. ముందుగా చక్కరను పోసి నీళ్లు పోసి కలుపుతూ ఉండాలి.. చక్కర కరగగానే యాలకుల పొడి, సైందవ లవణం, శొంఠి పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత మలా మూత పెట్టి చిన్న మంటపై మరో 15 నిమిషాల పాటు ఉడికించాలి. చక్కెర పాకం బంగారు వర్ణంలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిపై మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆమ్లా మూర్బా రెడీ.. చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు.. రోజుకు ఒకటి తింటే ఎన్నో రోగాలు మాయం అవుతాయి.. రోజంతా ఎనర్జిగా ఉంటారు..ఒక్కసారి తిని చూడండి మీకే తెలుస్తుంది..
తాజావార్తలు
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
-
Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
-
Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..