NTV Telugu Site icon

Mango : మామిడి తొక్కని తక్కువగా చూడకండి.. అది ఆరోగ్య నిధి

Mango

Mango

Mango : వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్‌లో మామిడి పళ్ల విక్రయాలు మొదలయ్యాయి. మామిడిని ఇష్టపడని వారు ఉండరు. మామిడి పండ్లను తినే సమయంలో సాధారణంగా ప్రజలు తొక్కను పనికి రాని చెత్తగా విసిరి పారేస్తుంటారు. అయితే ఈ మామిడి తొక్క ఆరోగ్య నిధి అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మామిడి తొక్క వల్ల కలిగే గొప్ప ప్రయోజనాల ఏంటో తెలుసుకుందాం. మామిడి పండు తొక్క అనేక చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది. ముఖానికి వాటి తొక్కను రాసుకుంటే చర్మం మెరుస్తోంది. ముందుగా మామిడికాయ తొక్కను మెత్తగా రుబ్బుకుని అందులో కాఫీపొడి కలపాలి. ఇప్పుడు తయారుచేసిన మిశ్రమంతో మీ చర్మాన్ని స్క్రబ్ చేయండి. జిడ్డు చర్మం ఉన్నట్లయితే, కొన్ని చుక్కల కొబ్బరి నూనెను జోడించవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది.

Read Also: Kodali Nani: చంద్రబాబు గుడివాడ పర్యటనపై ఘాటుగా స్పందించిన కొడాలి నాని

ఈ మిశ్రమాన్ని స్క్రబ్ చేసిన తర్వాత సబ్బు లేదా ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కో కూడదు. మీకు టానింగ్ సమస్య ఉంటే, మామిడి తొక్కను మెత్తగా రుబ్బి, అందులో పెరుగు కలిపి, ఆ మిశ్రమాన్ని చర్మంపై 10 నుండి 15 నిమిషాల పాటు పట్టించి, ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల టానింగ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. చర్మంపై మచ్చలు తొలగిపోవాలంటే మామిడి తొక్కపై కొన్ని చుక్కల తేనె వేసి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు తొలగిపోవడమే కాకుండా చర్మం ముడతలు లేకుండా కనిపిస్తుంది. మామిడి అన్ని కాలాల్లో దొరకదు కాబట్టి ఇప్పుడే మామిడి తొక్కలని తీసుకుని ఎండలో ఎండబెట్టండి. ఆ తర్వాత దాన్ని మిశ్రమం చేసుకుని భవిష్యత్‌లో వాడుకోవచ్చు.