NTV Telugu Site icon

Amarnath Yatra: అమర్నాథ్ యాత్ర కోసం జూన్ 1 నుండి యాత్రికుల కోసం మొదలుకానున్న హెలికాప్టర్ బుకింగ్..

Amarnath Yatra

Amarnath Yatra

శ్రీ అమర్‌నాథ్ యాత్రికుల కోసం ఆన్‌లైన్‌లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం జూన్ 1 న మొదలు కానున్నాయి. 52 రోజుల పాటు ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. ఈ యాత్ర కోసం యాత్రికుల కొరకు హెలికాప్టర్ సేవల ఆన్‌లైన్ బుకింగ్ జూన్ 1 న ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) తన అధికారిక వెబ్‌సైట్‌లో (అమర్‌నాథ్ యాత్రలో హెలికాప్టర్ సర్వీస్) ఆన్‌లైన్‌లో హెలికాప్టర్ల బుకింగ్ కోసం తుది తేదీ, ఛార్జీలు, ఇతర సంబంధిత సమాచారాన్ని త్వరలో జారీ చేస్తుందని వారు తెలిపారు.

Team India : ప్రపంచకప్ లో కోహ్లి, జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి.. మాజీ ప్లేయర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..

యాత్రికుల కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ ఇప్పటికే ఏప్రిల్ 15 నుండి ప్రారంభమైంది. లాంగర్ ఆర్గనైజింగ్ కమిటీలు జూన్ 15 న వస్తువులతో కూడిన ట్రక్కులతో జమ్మూ మరియు కాశ్మీర్‌లో ‘లంగర్’ (కమ్యూనిటీ కిచెన్) ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించి అనేక స్థలాలను గుర్తించారు. ఈ సంవత్సరం, పవిత్ర గుహ వరకు 125 లంగర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతించబడింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, మే 16న కత్రా పర్యటన సందర్భంగా భక్తులు దూతలుగా మారి భగవత్ సందేశాన్ని వ్యాప్తి చేయాలని కోరారు. అలాగే ఈ సంవత్సరం శ్రీ అమర్‌నాథ్ యాత్రకు దేశవ్యాప్తంగా, విదేశాల నుండి యాత్రికులను ఆహ్వానించారు ఆయన.