Amaravati Farmers : ఆదివారం తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన రాజధాని రైతులు బయలుదేరారు. తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు రానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో తమ మొక్కులను రాజధాని గ్రామాల రైతులు చెల్లించుకోనున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు పొంగళ్ళు నెత్తిన, అమ్మవారు ఫోటో చేత్తో పట్టుకొని కాలినడకన విజయవాడ అమ్మవారి దేవస్థానానికి రాజధాని రైతులు పయనమైయ్యారు. ఈ కార్యక్రమానికి రాజధాని 29 గ్రామాల నుంచి రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.
Miyapur: మియాపూర్ లో ప్రభుత్వ భూములు.. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు..
2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదేవిధంగా వెళ్లిన రైతులపై అప్పటి సర్జర్ లాఠీఛార్జ్ నిర్వహించారు. అప్పుడు మొక్కు చెల్లింపు పూర్తి కాకపోవడంతో నేడు చెల్లించేందుకు కాలినడకన అమరావతి రైతులు బయలుదేరారు. నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి దేవస్థానానికి అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు బయలుదేరారు. దింతో పెద్దఎత్తున్న డప్పులు, మేళాలతో అమరావతి రైతులు విజయవాడకి పయనమయ్యారు.
T20 World Cup 2024 : సంచలనం.. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయం..