Site icon NTV Telugu

Amani : రోజాను మంత్రిగా చూడటం ఆనందంగా ఉంది

Amani

Amani

విజయవాడలోని భవాని ఐలాండులో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. అయితే.. ఈ వేడుకల్లో సినీ నటి ఆమని పాల్గొని భవానీ ద్వీపంలో సందడి చేసింది. సంప్రదాయ, గ్రామీణ వాతావరణంలో సంక్రాంతి సందడి నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలు, వైజ్ఞానిక ప్రదర్శనలతో భవాని ఐలాండ్ అలరిస్తోంది. అయితే ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ.. మంత్రి రోజా టూరిజం అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని అభినందిస్తున్నానన్నారు. ఎంతో నేర్పుతో, కష్టపడి రాజకీయాల్లో ఎదిగిన రోజాకు సీఎం జగన్ సముచిత స్థానం ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. నాతోటి నటి.. స్నేహితురాల రోజాను మంత్రిగా చూడటం ఆనందంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఈ తరం పిల్లలు మరిచిపోతున్న సంప్రదాయాలను, రుచులను కళ్ళకు కట్టినట్టుగా భవాని ఐలాండులో చూపిస్తున్న టూరిజం శాఖకు కృతజ్ఞతలు తెలిపారు ఆమని.

Also Read : Trains Cancelled : ప్రయాణికులకు అప్డేట్‌.. పలు రైళ్లు రద్దు..

ఇదిలా ఉంటే.. నేడు ఉదయం భోగి మంటలను వేసిన మంత్రి రోజా.. మీడియాతో మాట్లాడుత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నాగబాబు ఇలా అందరిపై నిప్పులు చెరిగారు. డైమండ్‌ రాణి అంటూ కామెంట్ చేసిన పవన్ ఓ జోకర్ అని, నాగబాబు మనిషి ఎదిగారు గానీ, మెదడు పెరగలేదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు మంత్రి రోజా. మేల్ ఈగో అనేది పవన్ కల్యాణ్‌కు, టవర్ స్టార్‌కు బాగా ఎక్కువగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. వారికి రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఏం తెలియదని, కనీసం గెలవని గొట్టంగాళ్లు తన గురించి మాట్లాడటం.. చిల్లరగా ఉందంటూ మంత్రి రోజా సెటైర్లు వేశారు.

Also Read : Advocate Rayin : న్యాయంగా ఈ న్యాయవాదిది మంచి మనసు

Exit mobile version