చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో అమలాపాల్ కూడా ఒకరు. తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది అమలాపాల్. దాదాపు పది సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో రానిస్తుంది. అందరి స్టార్ హీరోలతో జత కట్టి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.అయితే కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు మాత్రం దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. 2011 నుండి 2015 మధ్య ఆమె తెలుగులో నాలుగు చిత్రాల్లో నటించింది. బెజవాడ తోనే తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నాయక్, ఇద్దరమ్మాయిలతో మరియు జెండాపై కపిరాజు వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో అమలాపాల్ అంతగా కనిపించలేదు.. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ్ లో పలు సినిమాలు చేస్తోంది. అలాగే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది అమలా పాల్.ఇదిలా ఉంటే అమలా పాల్ ఆమె అనే సినిమా లో న్యూడ్ గా నటించి అప్పట్లో షాక్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.
అంతే కాదు బోల్డ్ పాత్రల్లో అలాగే ఇంటెన్స్ సీన్స్ లో కూడా నటించడానికి ఎప్పుడూ కూడా మొహమాట పడనని తెలిపి అందరికి షాక్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో అమల పాల్ సినిమాలు బాగా తగ్గించింది. కారణం తెలియదు కానీ ఆమె కు పెద్ద సినిమా అవకాశాలు అయితే రావడం లేదు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.హాట్ హాట్ పోజులతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఈ అమ్మడు బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో తన అందాలతో కనువిందు చేస్తూ అమలాపాల్ ఇచ్చిన ఫోజులు అందరి మతిపోగొడుతున్నాయి. మరో వైపు ఈ అమ్ముడి కి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.ఈ వీడియోకి కుర్రాళ్లు చిలిపి కామెంట్స్ చేస్తున్నారు.