అక్కినేని అమల నాగచైతన్య పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నాగ చైతన్య ఎలాంటి వ్యక్తిత్వం కలవాడో ఆమె వెల్లడించారు. అమల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. జర్నలిస్ట్ `ప్రేమ` యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అమల అనేక విషయాల గురించి మాట్లాడారు..ఆ క్రమంలో అక్కినేని హీరో నాగచైతన్య పై అమల అక్కినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారాయి. చైతూని ప్రశంసిస్తూ ఆమె మాట్లాడటం గమనార్హం. నాగచైతన్య ఎంతో తెలివైన వాడని అతనికి ఏం కావాలో స్పష్టంగా తెలుసని ఎంతో క్లారిటీతో ఉంటాడని ఆమె తెలిపింది. అక్కినేని అమల గారు ఆమె పూర్తిగా ప్రైవేట్ లైఫ్‌నే ఇష్టపడుతుంటారు. తన ఫౌండేషన్, అలాగే ఏదైనా అవకాశం వస్తే సినిమాలు మాత్రమే చేస్తూ వుంటారు.. నాగచైతన్య గురించి ఆమె తెలిపిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు బాగా వైరల్‌గా మారింది
తాజాగా విడుదల చేసిన ఆ ఇంటర్వ్యూ ప్రోమోలోని వ్యాఖ్యలివి. అమల ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా తన తనయుడు అఖిల్ గురించి కూడా చెప్పుకొచ్చింది అమల. అఖిల్‌కి మనుషులంటే ఎంతో ఇష్టమని పీపుల్ లవ్వింగ్ పర్సన్ అని మనుషులను ఎక్కువగా ప్రేమిస్తాడని చెప్పుకొచ్చారు అమల . తన కొడుకు అఖిల్ కంటే నాగచైతన్య గురించే ఆమె ఎక్కువ విశేషాలు చెప్పుకొచ్చారు..ఇక ఇదే ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో ట్రోల్స్ పై కూడా స్పందించారు. సోషల్ మీడియా కంటే ప్రింట్ మీడియా ఎంతో ఎక్కువ డ్యామేజ్ చేస్తుందని, అది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుందని ఆమె బోల్డ్ కామెంట్స్ ను చేశారు. దానితో పోల్చితే సోషల్ మీడియా ఎంతో తక్కువ అని ఆమె పేర్కొంది. దీంతో పాటు తన ఫౌండేషన్ గురించి అలాగే ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.. సినిమాల్లో మహిళల పాత్రల్లో చేంజెస్ గురించి కూడా ఆమె తెలిపారు.ప్రస్తుతం అమల సినిమాలు చేయడం తగ్గించారు..సినిమాకు ఆ పాత్ర కీలకం అని అనిపిస్తే చేస్తున్నారు.ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్న పాత్రలువస్తే చేయడానికి సిద్ధం అని ఆమె తెలిపారు.. ఇటీవల ఆమె శర్వానంద్ నటించిన `ఒకే ఒక జీవితం`లో అమ్మ పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.