NTV Telugu Site icon

Alluri Krishnam Raju : అందుకే ఇన్నేళ్లు గ్యాప్ తీసుకున్నానంటున్న ‘వినాయకుడు’

New Project 2024 11 07t125344.365

New Project 2024 11 07t125344.365

Alluri Krishnam Raju : సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించాలి. హీరోహీరోయిన్లు అంటే ఇలాగే ఉండాలని కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకుని వాటిలో ఉండిపోతుంటారు జనాలు. కాస్త అటు ఇటైనా వారిని ఒప్పుకోరు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ బౌందరీలను దాటేసి సినిమాల్లో సక్సెస్ అయి ఇండస్ట్రీలో నిలుస్తుంటారు. అలా లావుపాటి శరీరంతోనూ హీరోయిజం పండించొచ్చని నిరూపించిన నటుడు కృష్ణుడు. వినాయకుడు చిత్రంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా మారి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

Read Also:Bandi Sanjay: భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..

హీరోలకు ఫిజిక్ తో సంబంధం లేదని తన స్టైల్ మూవీస్ తో ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణుడు. వరుస చిత్రాలతో బాగా ఎంటర్టైన్ చేస్తున్న ఆయన సడన్గా అతను సినిమాల్లో నటించడం మానేశాడు. ఇప్పుడు దాదాపు ఏడేళ్ల సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాను సినిమాలకు ఎందుకు దూరం అయ్యాను అన్న విషయాన్ని పేర్కొన్నారు. సినీ అభిమానులకు కృష్ణుడు పేరుతో పరిచయమైన ఆయన అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. గంగోత్రి చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించిన కృష్ణుడు. ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. హ్యాపీడేస్, వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న కృష్ణుడు ఇప్పుడు వరుస సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయాడు. ఇక దీని వెనక అసలు విషయాన్నీ తాజాగా ఆయన పాల్గొన్న ఓ పాడ్ కాస్ట్ లో వెల్లడించారు.

Read Also:Abhishek Banerjee: బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రిగా అతడేనా? రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే

‘నేను ఏ మూవీలో చేసిన నన్ను వినాయకుడు అనే పిలుస్తూ వచ్చారు. ఛాలెంజింగ్ గా ఉండే రోల్స్ ఏవి నా దగ్గరకు రావడమే లేదు. రొటీన్ గా ఒకే తరహా పాత్రలో నటించడం నాకు బాగా విసుగు అనిపిస్తోంది. నేను 160 కేజీల బరువు ఉండడంతో నాకు అన్ని అదే తరహా పాత్రలు ఇవ్వడం ఏదో ఇచ్చిన పాత్ర చేయడం నాకు నచ్చలేదు. అందుకే నేను ఏడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాను. నాకు ఇష్టమైన పనులను చేస్తూ.. టూర్స్ కి వెళ్తూ.. నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ గడపాను.’ అంటూ సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం వెల్లడించారు. ప్రస్తుతం బాగా బరువు తగ్గిన కృష్ణుడు.. త్వరలో విడుదల కాబోతున్న రామ్ చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో అవకాశం దక్కించుకున్నారు. ఆ మధ్య నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేసి ఓ సినిమాను తెరకెక్కించారు. తన కుమార్తె నిత్యా పేరు మీద నిత్యా క్రియేషన్స్ బ్యానర్ స్థాపించారు. ‘మై బాయ్ ఫ్రెండ్స్ గాళ్ ఫ్రెండ్’ చిత్రం ద్వారా లోతుగడ్డ జయరామ్ దర్శకుడిగా పరిచయం చేశారు.

Show comments