ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమాలకు ఖాళీ దొరికితే ఫ్యామిలితో వేకేషన్ కు వెళ్తుంటారు.. తాజాగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు.. ప్రస్తుతం ఈ హీరో ‘పుష్ప ది రూల్’ మూవీ షూటింగ్లో బిజీగా ఉండగా.. తాజాగా దాని నుండి షార్ట్ బ్రేక్ తీసుకున్నాడు. దుబాయ్ వెళ్తూ ఫ్యామిలీతో సహా ఎయిర్పోర్టులో కనిపించాడు.. అక్కడ కెమెరాలకు చిక్కాడు.. ఆ ఫొటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఆ ఫోటోలలో గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఫ్యామిలీ తో దుబాయ్ కు వెళ్లాడు.. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు అయ్యింది.. అదే క్రేజ్ తో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా కూడా ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజంను, డైలాగులను ఇమిటేట్ చేశారు సెలబ్రిటీలు. దీంతో బన్నీ వరల్డ్ ఫేమస్ అయిపోయాడు.. దాంతో ఎక్కడికి వెళ్లిన అభిమానులు సెల్ఫీలు,ఆటో గ్రాఫులు తీసుకుంటున్నారు..
ఇక దుబాయ్ లో అల్లు అర్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమయ్యింది. మార్చి 28 రాత్రి 8 గంటలకు ఈ విగ్రహం ఆవిష్కరించనున్నాడు అల్లు అర్జున్.. దానికోసమే రెండు రోజులు ముందే ఫ్యామిలీతో దుబాయ్ కు వెళ్లినట్లు తెలుస్తుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15 న విడుదల కాబోతుంది..