Allu Sirish Marriage: ఒకటైన అల్లు శిరీష్ – నయనిక.. వెడ్డింగ్ ఫోటోలు వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. ఇరు కుటుంభాల సమక్షంలో పెద్దల అంగీకారంతో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని కొల్లూరులో ఉన్న ‘ఐనా ఈవెంట్ స్పేస్’ (Aina Event Space) లో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. చిత్రమేమిటంటే, సరిగ్గా 15 ఏళ్ల క్రితం (2011) ఇదే రోజున అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి వివాహం జరిగింది. ఇప్పుడు అదే తేదీన శిరీష్ కూడా పెళ్లి చేసుకోవడం విశేషం. అల్లు అర్జున్ తన 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రోజే తమ్ముడి పెళ్లి కూడా జరగడంతో అల్లు కుటుంబంలో ఆనందం రెట్టింపైంది.
నయనిక రెడ్డి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన యువతి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) లో చదువుకున్న ఆమె, ప్రస్తుతం సొంతంగా బిజినెస్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ 2023లో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకల్లో మొదటిసారి కలుసుకున్నారు. అది కాస్తా ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరింది. కాగా ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఉపాసన, తమిళ స్టార్ హీరో సూర్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లిలో శిరీష్ క్లాసిక్ వైట్ సిల్క్ కుర్తాలో మెరవగా, నయనిక లావెండర్ అండ్ గోల్డ్ సిల్క్ చీరలో అప్సరసలా మెరిసిపోయారు.
Also Read
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!