NTV Telugu Site icon

Pushpa 2 Teaser: 12 గంటల్లోనే 51 మిలియన్స్.. నీయవ్వ ‘తగ్గేదేలే’!

Allu Arjun Pushpa

Allu Arjun Pushpa

Allu Arjun’s Pushpa 2 Teaser Record: అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప 2’ టీజర్‌కు యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. 68 సెకండ్ల నిడివి గల టీజర్‌తోనే ఆడియెన్స్ చేత మరోసారి అస్సలు తగ్గేదేలే అని పుష్పరాజ్ చెప్పించాడు. అది కూడా ఒక్క డైలాగ్ లేకుండా.. గూస్ బంప్స్ తెప్పించాడు. గంగమ్మ జాతర సెటప్‌లో అమ్మవారి గెటప్‌లో బన్నీని చూస్తే.. అభిమానులకే కాదు సోషల్ మీడియాకే అమ్మోరు పూనినట్టుంది. బన్నీ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చకు.. ప్రస్తుతం సోషల్ మీడియా కూడా పూనకాలు వస్తున్నట్టుగా ఊగిపోతోంది. పుష్పరాజ్ దెబ్బకు డిజిటల్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతున్నాయి.

పుష్ప 2 టీజర్ అలా రిలీజ్ అయిందో లేదో.. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రాబట్టింది. కేవలం 101 నిమిషాల్లోనే 500K లైక్స్ వచ్చాయి. దీంతో.. అత్యంత వేగంగా ఐదు లక్షల లైక్స్ సాధించి.. ఆల్ టైం రికార్డ్ సృష్టించిందని మేకర్స్ ప్రకటించారు. ఇక యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తూ.. 12 గంటల్లోనే 51 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే 1 మిలియన్స్ లైక్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో పుష్పరాజ్‌కు సంబంధించిన ట్యాగ్స్ టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ రచ్చ చేస్తున్నారు.

Also Read: RCB Fan: ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పింది.. ఐపీఎల్ మ్యాచ్‌కు వెళ్లి బాస్‌కు దొరికిపోయింది!

టీజర్‌తోనే పుష్ప2 సినిమాపై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. టీజర్‌ ఈ రేంజ్‌లో ఉంటే.. ఇక ట్రైలర్‌ను హై ఓల్టేజ్ యాక్షన్‌గా కట్ చేస్తే ఆగష్టు 15న బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్‌తో పాటు వెయ్యి కోట్లు ఖాతాలో పడినట్టే. లెక్కల మాస్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ సోయగం రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. పార్ట్ 1తో నేషనల్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్.. పార్ట్ 2లో నట విశ్వరూపం చూపించనున్నారు.

 

Show comments