Site icon NTV Telugu

Allu Arjun: రప్పా రప్పా నరుకుతా ఒక్కొక్కడినీ.. అల్లు అర్జున్ తగ్గేదేలే!

Allu Arjun Taggedhele

Allu Arjun Taggedhele

అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అందరికీ నమస్కారం. తెలంగాణ గద్దర్ అవార్డు నాకు అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, దిల్ రాజు గారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా దర్శకుడు సుకుమార్ లేకపోతే ఈ అవార్డు సాధ్యమయ్యేది కాదు. సుకుమార్ , ఈ అవార్డు మీ విజన్, మీ ప్రేమకు తార్కాణం.

Also Read:Gaddar Awards Sets : గద్దర్ అవార్డు సెట్ అదిరింది..

మా నిర్మాతలకు, మా సినిమాలో నటించిన ఇతర నటీనటులకు, టెక్నీషియన్లకు, సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రాజమౌళి గారు, మీరు ఆ రోజు పుష్ప మొదటి భాగం హిందీలో రిలీజ్ చేయమని చెప్పకుండా ఉంటే, ఈ అద్భుతం జరిగి ఉండేది కాదు. మిమ్మల్ని ఈ విషయంలో ధన్యవాదాలు చెప్పడానికి ఒక ఉత్తమ సందర్భం కోసం వేచి చూస్తున్నాను. ఇప్పుడు చెబుతున్నాను. ఇది నా జీవితంలో చాలా ప్రత్యేకమైన అవార్డు.

Also Read:Gaddar Awards Sets : గద్దర్ అవార్డు సెట్ అదిరింది..

పుష్ప సెకండ్ పార్ట్‌కి నేను గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ అవార్డును నా ఫ్యాన్స్ అందరికీ అంకితం చేస్తున్నాను. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఇంకా గర్వపడేలా చేస్తాను. నా ఆర్మీ, ఐ లవ్ యు. సినిమా అవార్డు కాబట్టి, సరదాగా ఒక డైలాగ్ చెప్పొచ్చా అని రేవంత్ రెడ్డి గారిని అడగగా ఆయన చెప్పమన్నారు. దీంతో పుష్ప సినిమా నుంచి, “ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా, గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు, రప్పా రప్పా నరుకుతా ఒక్కొక్కడినీ… పుష్ప, పుష్ప రాజ్… అస్సలు తగ్గేదే లే!” అంటూ డైలాగ్ చెప్పి అలరించి జై తెలంగాణ! జై హింద్! అంటూ ముగించారు.

Exit mobile version