Site icon NTV Telugu

Allu arjun : ఐకాన్ స్టార్ ఇంట్లో రాఖీ సెలెబ్రేషన్స్.. వైరల్ అవుతున్న పిక్స్..

Whatsapp Image 2023 08 31 At 6.21.25 Pm

Whatsapp Image 2023 08 31 At 6.21.25 Pm

నేడు రాఖీ పండుగ వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కూడా రాఖీ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు..వరుసగా రెండు రోజులు దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.సోదరీమణులు వారి సోదరులకు మధ్య వున్న అనుబంధానికి గుర్తుగా రాఖీ కట్టి.. వాళ్ళు ఎంతో సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.. అయితే సామాన్యుల నుండి సెలబ్రిటీలు వరకు ఈ రక్షా బంధన్ ను ఎంతో స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈసారి టాలీవుడ్ లో అందరికంటే ముందే.. రాఖీ సెలబ్రేషన్స్ అల్లుఅర్జున్ ఇంట మొదలు అయ్యాయి. .అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తన అన్న అయాన్ కి రాఖీ కట్టగా అల్లు స్నేహారెడ్డి చెల్లెలు పిల్లలకు కూడా అర్హ రాఖీ కట్టింది.. .

అలాగే అల్లు అర్జున్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తన కజిన్ సిస్టర్ తో ఆయన కూడా రాఖీ కట్టించుకున్నారు. ఆ ఫోటోని కూడా అల్లు స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు ఫ్యామిలీ తో పాటు చాలా మంది సెలబ్రిటీలు రాఖీ పండుగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.రీసెంట్ గా అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డ్ ను సాధించారు . టాలీవుడ్ లో ఈ ఘనత సాధించిన మొదటి హీరోగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది..పుష్పసినిమాలో తన అద్భుతమైన నటన మ్యానరిజానికి గాను ఈ అవార్డ్ దక్కింది.ఇక ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ లో ఎంతో బిజీ గా వున్నారు అల్లు అర్జున్ దాదాపు ఈమూవీ షూటింగ్ పూర్తి కావస్తుంది.. రీసెంట్ గా పుష్ప 2 షూటింగ్ కు సంబంధించి ఒక వీడియో ను కూడా షేర్ చేసారు అల్లు అర్జున్..పుష్పతో పాన్ఇండియా ఇమేజ్ సాధించిన అల్లు అర్జున్.. పుష్ప2 తో గ్లోబల్ వైడ్ గా తన మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అందుకే ఈసినిమా విషయంలో చిత్ర యూనిట్ ఆచి తుచి అడుగేస్తుంది.

Exit mobile version